Rajasthan : హత్య కేసు సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్ళింది-కోర్టుకు తెలిపిన పోలీసులు

హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.

Rajasthan : హత్య కేసు సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్ళింది-కోర్టుకు తెలిపిన పోలీసులు

Monkey

Rajasthan :  హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.

కేసు వివరాలలోకి వెళితే …….రాజస్ధాన్‌లోని జైపూర్‌లోని చాంద్వాజీ ప్రాంతంలో శశికాంత్ శర్మ అనే వ్యక్తి సెప్టెంబర్ 2016లో ఆదృశ్యమయ్యాడు. ఆదృశ్యమైన మూడు రోజులకు అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శశికాంత్ శర్మను హత్య చేసారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ హత్య కారణంగా అప్పట్లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. శశికాంత్ కుటుంబ సభ్యులు ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిని దిగ్భందం చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజులకు చాంద్వాజీ ప్రాంతానికే చెందిన ఇద్దరు నిందితులు రాహుల్, మోహన్ లాల్ కండేరాలను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు నిందితులు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసును వివిధ దశల్లో విచారణచేసి నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టారు.

పోలీసు స్టేషన్ ఆడిటరీలో ఖాళీ లేకపోవటంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఫైలును, సాక్ష్యా ధారాలను, మరో కేసుకు సంబంధించిన 15 ముఖ్యమైన ఆదారాలు ఉన్న బ్యాగ్‌ను పోలీసు స్టేషన్‌‌లోనే ఉన్న చెట్టు కింద దాచి పెట్టారు.

ఇటీవల ఈకేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రవేశ పెట్టమని కోర్టు కోరినప్పుడు… సాక్ష్యాధారాలను కోతి ఎత్తుకెళ్లిందని… అందుకు బాధ్యత వహించిన పోలీసు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. అనంతరం కాలంలో ఆ కానిస్టేబుల్ కూడా మరణించాడని పోలీసులు కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలిపారు.

Also Read : Loan Recovery Agents : లోన్ రికవరీ ఏజెంట్ల దాష్టీకం-వ్యక్తి ఆత్మహత్య