Union Minister Mansukh Mandaviya: మంకీపాక్స్ కొత్త వ్యాధికాదు.. వ్యాప్తి చెందకుండా అన్నిచర్యలు చేపట్టాం

దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మంగళవారం పార్లమెంట్‌లో మాట్లాడారు. మంకీపాక్స్ కేసు దేశంలో కొత్త వ్యాధి కాదని అన్నారు. అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Union Minister Mansukh Mandaviya: మంకీపాక్స్ కొత్త వ్యాధికాదు.. వ్యాప్తి చెందకుండా అన్నిచర్యలు చేపట్టాం

Union Minister Mansukh Mandaviya: భారత్ లో ఏడవ మంకీపాక్స్ ( Monkeypox ) కేసు నమోదైంది. కేరళ రాష్ట్రంలో మంగళవారం కొత్త కేసు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో మంకీపాక్స్ అనుమానిత వ్యక్తులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మంగళవారం పార్లమెంట్ లో మాట్లాడారు. మంకీపాక్స్ కేసు దేశంలో కొత్త వ్యాధి కాదని అన్నారు. అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దశలవారీగా తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Monkeypox: మంకీపాక్స్ లక్షణాలతో కేరళవాసి మృతి

మంకీపాక్స్ భారతదేశంలో, ప్రపంచంలో కొత్త వ్యాధి కాదని, 1970 నుంచి ఆఫ్రికా నుంచి ప్రపంచంలో చాలా మంకీపాక్స్ కేసులు నమోదవుతూ వచ్చాయన్నారు. WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) దీనిపై ప్రత్యేక దృష్టి సారించిందని, భారత్‌లోకూడా పర్యవేక్షణ ప్రారంభమైందని తెలిపారు. ఇంతకుముందు ప్రధానంగా ఆప్రికాకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఈ సంవత్సరం కనీసం 75 దేశాల్లో వ్యాపించిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 22వేలకుపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, డబ్ల్యూహెచ్‌ఓ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రపంచంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న వేళ భారతదేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసు

Monkeypox In AP: గుంటూరులో ఎనిమిదేళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలుకున్నామని, కేరళలో మొదటి కేసు రాకముందే అన్ని రాష్ట్రాలకు మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను సైతం జారీ చేశామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహించి కేంద్రానికి పంపాలని అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు లేఖ రాశామని కేంద్ర మంత్రి రాజ్యసభలో తెలిపారు.