rainfall: దేశంలో జూన్‌లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం: కేంద్రం

దేశ వ్యాప్తంగా జూన్‌లో ప‌డ్డ వ‌ర్షాల‌పై లోక్‌స‌భ‌కు కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రాలు తెలిపింది. ప్ర‌భుత్వానికి అందిన గ‌ణాంకాల ప్ర‌కారం... జూన్‌లో దేశంలో సాధార‌ణ వ‌ర్షపాతం (92 శాతం దీర్ఘకాలిక సగటు వర్షపాతం-ఎల్‌పీఏ) న‌మోదైంద‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత‌పూర్వ‌కంగా వివరణ ఇచ్చారు. అయితే, తూర్పు, ఈశాన్య భార‌త్‌లో జూన్‌లో వ‌ర్ష‌పాతం అధికంగా న‌మోదైంద‌ని చెప్పారు. మ‌ధ్య భార‌త్‌లో లోటు వ‌ర్ష‌పాతం న‌మోందైంద‌ని వివ‌రించారు.

rainfall: దేశంలో జూన్‌లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం: కేంద్రం

Jitendra

rainfall: దేశ వ్యాప్తంగా జూన్‌లో ప‌డ్డ వ‌ర్షాల‌పై లోక్‌స‌భ‌కు కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రాలు తెలిపింది. ప్ర‌భుత్వానికి అందిన గ‌ణాంకాల ప్ర‌కారం… జూన్‌లో దేశంలో సాధార‌ణ వ‌ర్షపాతం (92 శాతం దీర్ఘకాలిక సగటు వర్షపాతం-ఎల్‌పీఏ) న‌మోదైంద‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత‌పూర్వ‌కంగా వివరణ ఇచ్చారు. అయితే, తూర్పు, ఈశాన్య భార‌త్‌లో జూన్‌లో వ‌ర్ష‌పాతం అధికంగా న‌మోదైంద‌ని చెప్పారు. మ‌ధ్య భార‌త్‌లో లోటు వ‌ర్ష‌పాతం న‌మోందైంద‌ని వివ‌రించారు. ఈ ఏడాది మూడు రోజుల ముందుగానే 2022, మే 29న నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాకాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు.

జూలైలోనూ నైరుతి రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయ‌ని చెప్పారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బిహార్, ప‌శ్చిమ బెంగాల్‌, మేఘాల‌యా, నాగాలాండ్‌లో నైరుతి రుతుప‌వ‌న కాలంలో దాదాపు 30 ఏళ్ళ‌లో ఎన్న‌డూలేనంత‌గా వ‌ర్ష‌పాతం త‌గ్గింద‌ని తెలిపారు. అలాగే, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ ప‌రిస్థితి ఇలాగే ఉంద‌ని, మిగ‌తా ఏ రాష్ట్రంలోనూ అంత‌గా మార్పులు చోటుచేసుకోలేద‌ని చెప్పారు.

కాగా, ఈ ఏడాది నైరుతి రుతుప‌వ‌న సీజ‌న్‌లో ముందుగా అంచ‌నా వేసిన దాని కంటే అధికంగా వ‌ర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ రెండు నెల‌ల క్రితం తెలిపిన విష‌యం తెలిసిందే. జూన్ నుంచి సెప్టెంబ‌రు వ‌ర‌కు కొన‌సాగే నాలుగు నెల‌ల నైరుతి సీజ‌న్‌లో దీర్ఘ‌కాలిక స‌గ‌టు వ‌ర్ష‌పాతం 103 శాతంగా న‌మోద‌వుతుంద‌ని అంచ‌నాల‌ను ఐఎండీ విడుద‌ల చేసింది.

BSNL: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ