ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం

  • Published By: nagamani ,Published On : July 6, 2020 / 11:36 AM IST
ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం

ఒడిశా CM నవీన్ పట్నాయక్ చెప్పిన శుభవార్త రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లలో సంతోషాన్ని నింపింది. సామాజిక సంక్షేమ పథకంలో ట్రాన్స్‌జెండర్లకు చోటు కల్పించింది. ప్రతీ నెలా పెన్సన్ ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్‌జెండర్ సంఘ సభ్యులను చేర్చడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సామాజిక భద్రత, వికలాంగ ప్రజా సాధికారత (ఎస్‌ఎస్‌ఈపీడీ) మంత్రి అశోక్ పాండా ప్రకటించారు.

వికలాంగులు, నిరాశ్రయులైన వృద్ధులు, వితంతువులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టిన మధుబాబు పెన్షన్ యోజన(ఎంబీపీవై) కింద ఈ ట్రాన్స్ జెండర్ సంఘ సభ్యులకు చోటు కల్పించాలనే ప్రతిపాదనకు సీఎం నవీన్ పట్నాయక్ ఆమోదం పలికారనీ మంత్రి అశోక్ పాండా తెలిపారు. సుమారు 5వేల మంది ట్రాన్స్‌జెండర్‌లకు వారి వయస్సును బట్టి నెలకు రూ.500 నుంచి రూ.900 వరకు పెన్షన్ అందిస్తామన్నారు. దీని కోసం అవసరమైన నిధులు ఇప్పటికే కేటాయించామని..లబ్ధిదారులకు త్వరలో ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని మంత్రి తెలిపారు.

అధికార బీజేడీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ఆయన తెలిపారు. ఈ పథకం కింద ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందినవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని..దీనికి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంకతో 5వేల మంది ట్రాన్స్‌జెండర్లు లబ్ధి పొందుతారని తెలిపారు. ‘ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ట్రాన్స్‌జెండర్ పెన్షన్‌ను ప్రజా సంఘాలు..స్వచ్ఛంద సంస్థలు స్వాగతించాయి. కోవిడ్ -19 సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న 48 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,000 అదనపు సహాయం అందించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మరికొన్ని రాష్ట్రాలు ట్రాన్స్‌జెండర్ల కోసం ఇటువంటి సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలు కూడా వారికి పెన్షన్లను ప్రకటించాయి’ అని మంత్రి పాండా వివరించారు.

Read Here>>రూ.35 లక్షలు లంచం కేసులో మహిళా ఎస్సై అరెస్ట్