Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్

: గాయకుడు సిద్ధూ మూస్‌వాలా హంతకులు ఆయుధాలతో సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సిద్ధూను హత్యచేసిన తరువాత వారు కారులో వెళ్తూ తుపాకులు ఊపుతూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది.

Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్

Shooters

Moose Wala Shooters: గాయకుడు సిద్ధూ మూస్‌వాలా హంతకులు ఆయుధాలతో సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సిద్ధూను హత్యచేసిన తరువాత వారు కారులో వెళ్తూ తుపాకులు ఊపుతూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. షూటర్లలో ఒకరి ఫోన్‌లో ఈ వీడియోను గుర్తించారు. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అందరూ నవ్వుతూ పంజాబీ సంగీతం వింటూ.. కెమెరా ముందు తమ తుపాకీలను ప్రదర్శిస్తూ ఈ వీడియోలో కనిపించారు. షూటర్లలో చిన్నవయస్సు కలిగిన అంకిత్ సిర్సా ఫోన్‌ను తనిఖీ చేసిన తర్వాత ఈ వీడియో బయటపడింది.

Sidhu Moosewala’s postmortem : సిద్ధూ బాడీలో 25 బుల్లెట్లు.. ఎంత కసిగా చంపారంటే.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు

18ఏళ్ల యువకుడిని ఆదివారం రాత్రి ఢిల్లీలోని బస్ టెర్మినల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి సిధ్ధూ హత్యకేసులో దోషిగా తేలిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు అని పోలీసులు తెలిపారు. హత్యలో ప్రధాన షూటర్‌గా పోలీసులు తెలిపారు. అంకిత్ సిర్సా గాయకుడి దగ్గరికి వెళ్లి అతనిపై ఆరు బుల్లెట్లు కాల్చినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతని సహచరుడు సచిన్‌ వీరమణిని కూడా అరెస్టు చేశారు.

Woman Suicide: మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

దేశంలోనేకాక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్ధు మూస్ వాలాను మే29న పంజాబ్‌లో తన కారులో కాల్చి చంపారు. పోలీసులు విచారణలో హత్యకు ప్రధాన సూత్రధారి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోమ్ గా పోలీసులు తేల్చారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ గుజరాత్‌లోని కచ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను గత నెలలో అరెస్టు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి ఎనిమిది గ్రెనేడ్లు, 9 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, మూడు పిస్టల్స్, ఒక రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.