కరోనా నుంచి కోలుకున్న వారికి ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎలా సోకుతుంది ?

కరోనా నుంచి కోలుకున్న వారికి ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎలా సోకుతుంది ?

fungal infection mucormycosis : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఎంతో మందిని బలి తీసుకుంది. ఈ వ్యాధి బారిన పడి..కొంతమంది కోలుకున్నారు. అయితే..కోలుకున్న కొంతకాలానికి పలువురిలో ‘మ్యూకర్ మైకోసిస్’ అనే ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించినట్లు గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యవంతులతో పోలిస్తే..దీర్ఘకాలిక వ్యాధుల (మధుమేహం, కేన్సర్, హెచ్ఐవీ రోగులు, అవయవ మార్పిడి)తో బాధపడే వారిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు.

దీంతో అతి సులువుగా ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) దాడి చేస్తుందని, తమ ఆసుపత్రిలో ఈ ఫంగస్ బారిన పడి..ఐదుగురు చనిపోయారని అహ్మదాబాద్ ప్రభుత్వ దంత వైద్య కళాశాల సర్జన్ సోనల్ అంచ్ లియా తెలిపారు. 13 మంది ఈ ఫంగస్ బారిన పడి ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో చేరారని, పలువురిలో దృష్టిలోపం తలెత్తిందన్నారు. ఇంకొందరికి సర్జరీ చేసి ముక్కు, పై దవడ ఎముకలను తొలగించాల్సి వచ్చిందని, ఢిల్లీలో ఐదుగురు చనిపోయారని చెప్పడం కలకలం రేపుతోంది.

ఫంగస్ ఎలా సోకుతుంది ?

మ్యూకర్ మైట్ మోల్ట్ రకానికి ఫంగస్ కారణంగా..మ్యూకర్ మైకోసిస్ సోకుతుంది. గాలి, మట్టి, ఆకులు, కంపోస్టు ఎరువుల కుప్పలు, కుళ్లిపోతున్న కలపలో ఉంటుంది. మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే..కేంద్ర నాడి వ్యవస్థ, కళ్లు, సైనస్ లు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని బారినపడిన వారిలో జ్వరం, జలుబు, చెంపల వాపు, వాసనతో కూడిన నలుపు రంగు చీమిడి, ముక్కులో పొడిగా ఉండే నలుపు రంగు శ్లేష్మం పేరుకుపోవడం, ముక్కు దిబ్బడ, కళ్ల వాపు, మొహం మొద్దుబారినట్లు అనిపించడం వంటి ప్రాథమిక లక్షణాలు ఉంటాయి.

ఎవైనా గాయాలు తగిలి..ఈ ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తే..ఆ భాగంలోని శరీర రక్త నాళాల్లోకి ప్రవేశించి..వాటి ద్వారా..రక్తప్రవాహానికి అడ్డుగోడలా నిలుస్తుంది. అక్కడి నుంచి రక్తం అందకపోవడం, కణజాలానికి అనుసంధానమై ఉండే ఎముక నిర్జీవం అవుతుంది. దవడ భాగానికి సోకితే..ఆ భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. సజీవ ఎముకలకు కూడా ఈ ఫంగస్ వ్యాపిస్తుంది. వెంటనే చికిత్స తీసుకోకపోతే..ప్రాణాంతకంగా మారుతుంది. సార్స్‌, కొవిడ్‌-19 వైర్‌సల వ్యాప్తికి వాతావరణ మార్పులే కారణమై ఉండొచ్చని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.