Centenarian Voters: వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది.. ఈసీ వెల్లడి

వంద సంవత్సరాల వయసు దాటిన ఓటర్లు దేశంలో 2.5 లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ వయసుల వారికి సంబంధించిన గణాంకాలను ఈసీ ప్రకటించింది.

Centenarian Voters: వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది.. ఈసీ వెల్లడి

Centenarian Voters: దేశంలో వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. భారత ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ వివరాల్ని మీడియాకు అందించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో వందేళ్లు దాటిన ఓటర్లు 2,55,598 లక్షల మంది ఉన్నారు.

Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

80 ఏళ్లు దాటిన ఓటర్లు 1,83,53,347 మంది. టీనేజ్ ఓటర్లు.. అంటే 18-19 ఏళ్లు కలిగిన ఓటర్లు 1,52,34,341 మంది కాగా, 20-29 ఏళ్ల వయసు కలిగిన ఓటర్లు 20,06,65,436. దేశంలో ఉన్న ఓటర్ల గణాంకాలను ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటుంది. కాగా, రాజీవ్ కుమార్ గతంలో దేశ తొలి ఓటర్‌ అయిన శ్యామ్ సర్ నేగిని కలుసుకున్నారు. ఆయన 105 ఏళ్ల వయసులో గతవారం మరణించిన సంగతి తెలిసిందే.

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నేగి మరణించడానికి మూడు రోజుల ముందు కూడా ఓటు వేయడం గమనార్హం. ఈసీ తరఫున దేశంలో ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్లు, దీనికోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.