New Guidelines : ఆ డ్రగ్స్ పెద్దల కోసమే..పిల్లల్లో కరోనాపై కేంద్రం గైడ్ లైన్స్ విడుదల

కరోనా సోకిన పిల్లల సంరక్షణ కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది.

New Guidelines : ఆ డ్రగ్స్ పెద్దల కోసమే..పిల్లల్లో కరోనాపై కేంద్రం గైడ్ లైన్స్ విడుదల

Most Drugs Given To Adult Covid Patients Not Recommended For Children Govt Says

New Guidelines కరోనా సోకిన పిల్లల సంరక్షణ కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. కరోనా ట్రీట్మెంట్ లో భాగంగా వినియోగిస్తున్న ఐవర్​మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరవిర్ వంటి మెడిసిన్స్ కేవలం పెద్దల కోసమేనని.. కరోనా సోకిన చిన్నారులకు ఈ మెడిసిన్స్ ఇవ్వకూడదని కేంద్రం సృష్టం చేసింది. చిన్నారులకు వీటిని ఉపయోగించేందుకు సిఫార్సు చేయలేదని తెలిపింది. డాక్సిసైక్లైన్, అజిథ్రోమిసిన్ వంటి యాంటీ బయాటిక్స్​కు కూడా ఇదే వర్తిస్తుందని తాజా గైడ్ లైన్స్ లో పేర్కొంది. ఈ మెడిసిన్స్ యాంటీ బయాటిక్స్​ ను పిల్లలపై ఇప్పటివరకు ప్రయోగించలేదని తెలిపింది.

ఎక్కువ మంది చిన్నారులకు కరోనా లక్షణాలు ఉండటం లేదని కేంద్రం తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేసింది. వీరికి పారాసిటమాల్ ట్యాబ్లెట్లను సిఫార్సు చేసింది. ఈ పేషెంట్లపై పర్యవేక్షణ ఉంచాలని ఆశా, ఎంపీడబ్ల్యూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. తల్లితండ్రులు కొవిడ్ సోకిన పిల్లల శ్వాసక్రియ రేటును, ఆక్సిజన్ స్థాయులను గమనిస్తూ ఉండాలని సూచించింది. పదేళ్లు పైబడిన పిల్లల్లో కరోనా వ్యాప్తి వయోజనుల స్థాయిలోనే ఉంటుందని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. ఆరోగ్యంగా ఉన్న చిన్నారుల్లో తీవ్రస్థాయిలో కరోనా ప్రబలే అవకాశం చాలా అరుదు అని వివరించింది. చిన్నారుల్లో కొవిడ్ ​కు సంబంధించి త్వరలోనే జాతీయ రిజిస్ట్రీ ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది.

కేంద్రం విడుదల చేసిన తాజా గైడ్ లైన్స్
– పిల్లల హాస్పిటల్స్ లో..కరోనా సోకిన చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
-తీవ్రమైన కొవిడ్​తో బాధపడే చిన్నారులకు ట్రీట్మెంట్ అందించేలా ప్రస్తుతమున్న కొవిడ్ సంరక్షణ కేంద్రాలు సదుపాయాలను మెరుగుపర్చుకోవాలి.
-చిన్నారులకు ప్రత్యేకంగా అవసరమయ్యే పరికరాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి.
-రెండో దశలో గరిష్ఠంగా నమోదైన కేసుల ఆధారంగా ప్రతి జిల్లాలో చిన్నారుల కోసం అదనపు పడకల ఏర్పాటుకు అంచనాకు రావాలి.
-సుశిక్షితులైన డాక్టర్లు, నర్సులును సిద్ధం చేసుకోవాలి.
-చిన్నారుల సంరక్షణ కోసం వైద్య అధికారులు సామర్థ్యం పెంపు కార్యక్రమాలు చేపట్టాలి.
-జిల్లా హాస్పిటల్స్ కు, కొవిడ్ కేర్ సెంటర్లకు మెడికల్ కాలేజీలు సహకారం అందించాలి.
-ఉత్తమ కొవిడ్ కేర్ సెంటర్లను గుర్తించి.. కింది స్థాయిలోని కేంద్రాలకు వీటి ద్వారా సహకారం అందేలా చేయాలి

ఇక,కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. లాక్​డౌన్ తొలగించడం, పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి పెరగొచ్చని అభిప్రాయపడింది. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యం అవసరమని కేంద్రం తెలిపింది.