‘క్వీన్’కు ఏషియన్ అవార్డ్.. మొక్కలు నాటిన సంజయ్ దత్.. సూపర్‌స్టార్ సరికొత్త రికార్డ్..

  • Published By: sekhar ,Published On : December 8, 2020 / 02:17 PM IST
‘క్వీన్’కు ఏషియన్ అవార్డ్.. మొక్కలు నాటిన సంజయ్ దత్.. సూపర్‌స్టార్ సరికొత్త రికార్డ్..

Most Tweeted Hashtag 2020: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా.. ‘శివగామి’ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్.. ‘క్వీన్’.. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఏషియన్ అవార్డ్ కూడా లభించింది. సింగపూర్ ఏషియన్ అకాడెమీ క్రియేటివ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సిరీస్ కేటగిరీలో ‘క్వీన్’ను ఈ అవార్డ్ వరించింది. ఈ సిరీస్‌కు రేష్మ రచన చేయగా, గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహించారు.

Queen

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సంజూ బాబా..
సోమవారం(డిసెంబర్ 7) రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడింది. చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేకెత్తించన ‘కె.జి.యఫ్’ సీక్వెల్ ‘కె.జి.యఫ్ 2’ లో అధీరా క్యారెక్టర్ చేస్తున్నారు సంజయ్ దత్..

Sanjay Dutt

సూపర్‌స్టార్ సోషల్ మీడియా రికార్డ్..
సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ట్విట్టర్‌లో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్‌ట్యాగ్ 2020 గా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నిలిచింది. కాగా సూపర్‌స్టార్ ఈ ఘనత సాధించడం ఇది ముచ్చటగా మూడోసారి. 2018 లో ‘భరత్ అనే నేను’, 2019 లో ‘మహర్షి’ సినిమాలు ఆయా సంవత్సరాల్లో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్‌ట్యాగ్స్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచాయి.

Mahesh Babu