వ‌ర‌క‌ట్నం కేసులో త‌ల్లీకొడుకుకు ఏడేళ్లు జైలు శిక్ష

వ‌ర‌క‌ట్నం కేసులో త‌ల్లీకొడుకుకు ఏడేళ్లు జైలు శిక్ష

Mother And Son Sentenced To Seven Years In Prison In Dowry Harassment Case

Mother and son sentenced to seven years in prison : వరకట్న వేధింపుల కేసులో తల్లీ, కొడుకుకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, చెరో 6000 రూపాయల జరిమానా విధించింది. పోలీసుల కథనం ప్రకారం బాధితురాలు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన ఎస్.లీలావతి, హైదరాబాద్ మల్కాజ్ గిరికి చెందిన ఎస్.శశికిరణ్ రెడ్డి (35)లకు 2015 అక్టోబర్ లో వివాహం అయింది. వివాహ సమయంలో లీలావతి తల్లిదండ్రులు నగదు, బంగారం, వ్యవసాయ భూమి, ఇతర వస్తువులను ఎస్.శశికిరణ్ రెడ్డికి వరకట్నంగా ఇచ్చారు.



వివాహం తర్వాత వీరు నెల రోజులు సంతోషంగా ఉన్నారు. ఆతర్వాత కొద్దికాలానికే అదనపు కట్నం కోసం లీలావతిని అత్తింటి వారు వేధించసాగారు. 2016 ఫిబ్రవరి నుంచి అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమెకు కనీసం ఆహారం కూడా పెట్టకుండా వేధించారు. ఈ వేధింపులను తట్టుకోలేని లీలావతి జూన్ 2016లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.



మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మల్కాజ్ గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని, శశికిరణ్ అతని తల్లి ఉషాను అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు తల్లీ, కొడుకుకు ఏడేళ్ల జైలు శిక్ష, చెరో రూ.6 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.