Mother’s Day 2021: అమ్మకు నీరాజనం.. సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత శిల్పం!

ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మ లేనిదే సృష్టి లేదు. మన నిండు జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నవమాసాలు మోసి కని పెంచడానికి తల్లి ఎంత కష్టపడుతుందో బిడ్డకి తెలియకపోవచ్చు. కానీ తను బతికున్నంతకాలం ఎంత ప్రేమను పంచుతుందో ప్రతి బిడ్డకి తెలుస్తుంది.

Mother’s Day 2021: అమ్మకు నీరాజనం.. సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత శిల్పం!

Mother’s Day 2021

Mother’s Day 2021: ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మ లేనిదే సృష్టి లేదు. మన నిండు జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నవమాసాలు మోసి కని పెంచడానికి తల్లి ఎంత కష్టపడుతుందో బిడ్డకి తెలియకపోవచ్చు. కానీ తను బతికున్నంతకాలం ఎంత ప్రేమను పంచుతుందో ప్రతి బిడ్డకి తెలుస్తుంది. అమ్మది నిస్వార్థ ప్రేమ. బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండా… కంటికి రెప్పలా కాపాడుతుంది. తాను పస్తులుండైనా బిడ్డల కడుపు నింపుతుంది. తన కష్టాన్ని అమృతంలా మారుస్తుంది. అన్నీ తానై పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మ కోసమే మాతృదినోత్సవం పుట్టింది.

అమ్మల దినోత్సవం సందర్భంగా ప్రపంచం మెచ్చిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన ఇసుక శిల్పాన్ని రూపొందించి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. అందమైన అమ్మ ముఖాన్ని చెక్కి అన్ని రంగాల్లో రాణిస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ కళాఖండం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏడాది మాతృ దినోత్సవం రోజుల భిన్న రకాలుగా శిల్పాలను చెక్కి శుభాకాంక్షలు చెప్పే సుదర్శన్ ఈ ఏడాది ఇలా రూపొందించారు. I LOVE MY MOTHER అంటూ చెక్కిన ఈ శిల్పాన్ని అయన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి తల్లులకు వందనం అని రాసుకొచ్చారు.