Trivikram : హిట్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా?.. అసలు ఇద్దరికీ సెట్ అవుతుందా??

ఆల్రెడీ దెబ్బకొట్టిన లైగర్ తో డిఫెన్స్ లో పడ్డాడు విజయ్. అందుకే నెక్ట్స్ మూవ్ కాస్త జాగ్రత్తగా వెయ్యాలనుకుంటున్నాడు. ఖుషీ లాస్ట్ స్టేజ్ కి రావడంతో నెక్ట్స్ సినిమా.............

Trivikram : హిట్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా?.. అసలు ఇద్దరికీ సెట్ అవుతుందా??

movie in Trivikram vijay devarakond combination will be soon

Trivikram :  ఆల్రెడీ దెబ్బకొట్టిన లైగర్ తో డిఫెన్స్ లో పడ్డాడు విజయ్. అందుకే నెక్ట్స్ మూవ్ కాస్త జాగ్రత్తగా వెయ్యాలనుకుంటున్నాడు. ఖుషీ లాస్ట్ స్టేజ్ కి రావడంతో నెక్ట్స్ సినిమా ఫైనల్ చెయ్యడం కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లతో సినిమా చేస్తున్నాడంటూ రూమర్స్ వినిపిస్తున్నా లేటెస్ట్ గా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ చేసేసుకున్నాడంటూ మరో న్యూస్ వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ తర్వాత జాగ్రత్త పడుతున్నాడు. కొత్త సినిమా విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాడు. ఏమాత్రం దెబ్బ పడుతుందనే డౌట్ఉన్నా కమిట్ అయిన సినిమా అయినా సరే పక్కన పెట్టేస్తున్నాడు. లైగర్ తర్వత చాలా స్టోరీలు విన్న విజయ్ ఇప్పటి వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. అయితే ఆల్రెడీ సమంతతో చేస్తున్న ఖుషీ లాస్ట్ స్టేజ్ కి రావడంతో నెక్ట్స్ సినిమా వెతుక్కోక తప్పని పరిస్తితి ఎదురైంది విజయ్ కి.

విజయ్ తన నెక్ట్స్ సినిమా కోసం గౌతమ్ తిన్ననూరి తోపాటు, హరీష్ శంకర్ తో కూడా చర్చలు జరిపాడని, ఆల్రెడీ సినిమాలకు ఓకే చెప్పేశాడని విపరీతంగా రూమర్లు వినిపించాయి. ఇక సుకుమార్ తో ఉన్న సినిమా పుష్ప 2 అయ్యేదాకా వాయిదా పడినట్టే. ఆ తర్వాత కూడా ఆ కాంబినేషన్ డౌటే. అయితే లేటెస్ట్ గా త్రివిక్రమ్ తో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడని టాక్. బ్యాక్ టూ బ్యాక్ వరుసగా మూడు ఫ్లాపులతో ఉన్న విజయ్ కి ఇప్పుడు హిట్ చాలా అవసరం. ఇక ఎట్టి పరిస్తితుల్లో కెరీర్ విషయంలో ఛాన్స్ తీసుకోకూడదని డిసైడ్ అయిన విజయ్ త్రివిక్రమ్ కి ఓకే చెప్పాడని న్యూస్ వినిపిస్తోంది.

 

విజయ్ దేవరకొండ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాని దిల్ రాజుతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారు. ఆల్రెడీ విజయ్ దగ్గర దిల్ రాజు అడ్వాన్స్ ఉంది, ఇక సితార త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ కావడంతో ఇద్దరి కాంబినేషన్లో త్రివిక్రమ్ విజయ్ తో సినిమా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని వరాతలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ తో సమ్మర్ కి రిలీజ్ టార్గెట్ పెట్టుకుని త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఇక విజయ్ కూడా ఖుషీ సినిమాని ఎర్లీ సమ్మర్ కే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇలా ఇద్దరూ సమ్మర్ కి ఫ్రీ అయిపోతారు కాబట్టి విజయ్, త్రివిక్రమ్ సినిమా ఉండే ఛాన్సులు ఎక్కువే అంటున్నారు.

Rashmi Gautam : జబర్దస్త్‌కి కొత్త యాంకర్ వచ్చినా నాకు ప్రాబ్లమ్ లేదు.. సౌమ్యతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు..

అయితే విజయ్ లాంటి యాటిట్యూడ్, మాస్ కావాలనుకునే హీరోకి, త్రివిక్రమ్ లాంటి సాఫ్ట్, మాటలతోనే మాయ చేసే డైరెక్టర్ కి సెట్ అవుతుందా అసలు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.