Movie Theatres : థియేటర్లు ఓపెన్.. ముందు పడే బొమ్మ ఎవరిది..?

లాక్‌డౌన్ స్టెప్ బై స్టెప్ అన్‌లాక్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొడుతున్న కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగ్స్, రిలీజెస్ మీద కసరత్తులు చేస్తున్నారు మేకర్స్..

Movie Theatres : థియేటర్లు ఓపెన్.. ముందు పడే బొమ్మ ఎవరిది..?

Movie Theatres Re Opening From July Month End

Movie Theatres: లాక్‌డౌన్ స్టెప్ బై స్టెప్ అన్‌లాక్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొడుతున్న కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగ్స్, రిలీజెస్ మీద కసరత్తులు చేస్తున్నారు మేకర్స్. మరి థియేటర్లు స్టార్ట్ అయ్యే దెప్పుడు..? థియేటర్లో ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా ఏంటి..? డీటెయిల్డ్‌గా చూద్దాం..

షూటింగ్ చేస్కోలేక, రెడీ అయిన సినిమాలను రిలీజ్ చేసుకోలేక, సినిమా ఇండస్ట్రీ నష్టాల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ రిలాక్సేషన్స్ ఇవ్వడంతో మళ్లీ నార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నారందరూ. ఇప్పటికే మహారాష్ట్రలో కోవిడ్ ప్రోటోకాల్‌తో 8 గంటల షూటింగ్‌కి పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఇక టాలీవుడ్‌లో కూడా ఈ మంథ్ ఎండ్ నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది.

సినిమా షూటింగ్స్ మొదలయ్యాయంటే.. థియేటర్లు కూడా త్వరలోనే రిలీజ్ కోసం రెడీ అవ్వబోతున్నాయి. ఇప్పటికే 2,3 నెలల నుంచి మూసేసిన థియేటర్లు మళ్లీ జూలై చివరికి గానీ ఆగస్ట్‌లో గానీ తెరుచుకుంటాయని టాలీవుడ్ టాక్. థియేటర్లు ఓపెన్ అయినా కూడా ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా సగం సీటింగ్ కెపాసిటీతో రన్ చేయడం, ఒక షో కి మరో షో కి మధ్యలో శానిటైజ్ చెయ్యడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్లు రన్ చెయ్యాల్సిందే .

థియేటర్లు ఓపెన్ చేసినా జనం అప్పుడే వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది కాబట్టి.. ముందుగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి.. ఇప్పటికే రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ‘ఇష్క్’ (తేజ సజ్జా), రౌడీ బాయ్స్, థియేటర్లోనే రిలీజ్ చేస్తామన్న ‘గుడ్ లక్ సఖి’, ‘తిమ్మరసు’, ‘సెహరి’ సినిమాలతో పాటు విశ్వక్ సేన్ హీరోగా చేసిన ‘పాగల్’ లాంటి చిన్న సినిమాలు ముందుగా రిలీజ్ అయ్యే ఛాన్సుంది.

ఆగస్ట్ ఫస్ట్ నుంచి చిన్న సినిమాలు రిలీజ్ అయినా.. రెస్పాన్స్‌ని బట్టి.. ఆగస్ట్ మిడ్ నుంచి లేదా ఆగస్ట్ లాస్ట్‌లో.. ‘లవ్ స్టోరీ’, ‘విరాట పర్వం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి మిడిల్ రేంజ్ సినిమాలు రిలీజ్ అవ్వొచ్చు. అయినా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే గానీ.. జనాలు మళ్లీ థియేటర్లోకి వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. మరి పిల్లి మెడలో గంట కట్టేది ఎవరో.. లాక్‌డౌన్ క్రైసిస్ తర్వాత ఫస్ట్ ఆ పెద్ద రిస్క్ తీసుకునే సినిమా ఎవరిదో వెయిట్ చేసి చూడాల్సిందే..