MP Raghurama: ఎంపీ ఆర్ఆర్ఆర్ వైద్య పరీక్షలపై సుప్రీం కీలక ఉత్తర్వులు..!

ఎంపీ రఘురామకృష్ణం రాజు వైద్య పరీక్షలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. ఆయన్ను తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని.. వైద్య పరీక్షలను పూర్తిగా వీడియో రూపంలో రూపొందించాలని.. వైద్యుల నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

MP Raghurama: ఎంపీ ఆర్ఆర్ఆర్ వైద్య పరీక్షలపై సుప్రీం కీలక ఉత్తర్వులు..!

Mp Raghurama

MP Raghurama: ఎంపీ రఘురామకృష్ణం రాజు వైద్య పరీక్షలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. ఆయన్ను తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని.. వైద్య పరీక్షలను పూర్తిగా వీడియో రూపంలో రూపొందించాలని.. వైద్యుల నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీని కోసం తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలయ్యేలా ఏపీ సీఎస్ ఏర్పాట్లు చేయాలని సుప్రీం ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఎంపీ రఘురామను 3 రోజుల క్రితం ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు కింది కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. దీంతో ఆయన తరపు న్యాయవాదులు జిల్లా కోర్టుకు వెళ్లగా ఈ నెల 28 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన లాయర్లు సుప్రీంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు ఇక్కడ విచారణ జరిగింది.

మరోవైపు గుంటూరు సీఐడీ కార్యాలయంలో పోలీసుల ముసుగులో తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని ఎంపీ రఘురామ ఆరోపణలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఆదివారం రఘురామకు పరీక్షలు నిర్వహించి ఉదయం 10 గంటల 30 నిమిషాల కల్లా మెడికల బోర్డు నివేదిక అందజేయాలని జిల్లా కోర్టు, మధ్యాహ్నం 12లోగా ఇవ్వాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కోరింది. ఈ క్రమంలో గుంటూరులోని జీజీహెచ్‌ లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. అదలా ఉండగానే నేడు సుప్రీంకోర్టు ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కీలక ఆదేశాలు జారీచేసింది.