Sharad Pawar House : ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ ఇంటిపై చెప్పులు, రాళ్లు రువ్విన ఎమ్‌ఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు

మహారాష్ట్రలో కొన్ని రోజులుగా MSRTC ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కారించాలని ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Sharad Pawar’s house : ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటిపై చెప్పులు, రాళ్లతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు దాడికి ప్రయత్నించారు. శరద్ పవార్‌, అజిత్ పవార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లు, గేట్లు తోసుకొని లోపలికి చొచ్చుకెళ్లి ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా…భారీ సంఖ్యలో ఇంటిలోపలికి వెళ్లారు. దీంతో కాసేపు హైటెన్షన్ నెలకొంది.

మహారాష్ట్రలో కొన్ని రోజులుగా MSRTC ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కారించాలని ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమను ట్రీట్ చేయాలంటూ కోరుతున్నారు. అయితే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు.

Rahul Gandhi: ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాం: రాహుల్ గాంధీ

ఉద్యోగుల సమ్మెపై బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో కీలక తీర్పు వెలువరించింది. సమ్మెను విరమించాలని ఆదేశించింది. వెంటనే విధుల్లో చేరాలని చెప్పింది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు తమకు అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్‌ వెల్లడించారు.

అయితే ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని…ఇందుకు అఘాడీ సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న శరద్ పవార్ కారణమంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఎంతో మంది ఆర్టీసీ ఉద్యోగుల మరణానికి కారణమయ్యారని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు