Mud Bath: బురద నీటిలో స్నానం.. రోడ్డుపై గుంతలు పూడ్చాలంటూ వినూత్న నిరసన.. వీడియో వైరల్

రోడ్లు బాగు చేయాలంటూ ఎమ్మెల్యే ముందు వినూత్న నిరసనకు దిగాడో వ్యక్తి. రోడ్డుపై ఉన్న బురద నీటిలోనే స్నానం చేశాడు. అక్కడే యోగా కూడా చేశాడు. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

Mud Bath: బురద నీటిలో స్నానం.. రోడ్డుపై గుంతలు పూడ్చాలంటూ వినూత్న నిరసన.. వీడియో వైరల్

Mud Bath: రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే విషయంలో అధికారులు చాలా సార్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన ఉండదు. ఇలాంటప్పుడు విసుగెత్తిన కొందరు వినూత్నంగా నిరసన చేపడుతుంటారు. తాజాగా కేరళకు చెందిన ఒక వ్యక్తి కూడా తన నిరసన తెలియజేసేందుకు నూతన పంథా ఎంచుకున్నాడు. రోడ్డుపై ఉన్న బురద గుంటలోనే స్నానం చేశాడు.

Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట

అక్కడే యోగా కూడా చేశాడు. అది కూడా స్థానిక ఎమ్మెల్యే ముందు కావడం విశేషం. కేరళ, మలప్పురం పట్టణంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇటీవలి వర్షాలకు రోడ్లు మరింతగా పాడయ్యాయి. అనేక చోట్ల గుంతలు పడి రోడ్లపై బురద నీరు నిలిచి ఉంటోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి విషయంలో ఫిర్యాదు చేసినప్పటికి అధికారులు వాటిని బాగు చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన హమ్జా పొరాలి అనే స్థానికుడు వినూత్నంగా నిరసన తెలియజేశాడు. ఆ రోడ్డు మార్గంలో ఎమ్మెల్యే వెళ్తుండగా, రోడ్డుపై ఉన్న బురద నీటిలో స్నానం చేశాడు. అక్కడికే బకెట్ తెచ్చుకుని మరీ బురద నీటితోనే స్నానం ముగించాడు.

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

అంతటితో ఆగకుండా అదే నీటిలో యోగా కూడా చేశాడు. ఇదంతా జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే లతీఫ్ అక్కడే ఉన్నాడు. ఈ వ్యవహారాన్ని స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. హమ్జా తన వినూత్న నిరసనతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగాడు. ఈ ప్రాంతంలోనే కాకుండా.. కేరళలో అనేక చోట్ల రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. పలు చోట్ల స్థానికులు రోడ్లు బాగు చేయాలంటూ నిరసన తెలియజేస్తున్నారు.