Mukesh Ambani: ఆసియాలోనే ధనవంతుడిగా ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కునెట్టి, ముఖేష్ అంబానీ ఆసియాలో నెంబర్ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు.

Mukesh Ambani: ఆసియాలోనే ధనవంతుడిగా ముఖేష్ అంబానీ

Mukesh Ambani

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కునెట్టి, ముఖేష్ అంబానీ ఆసియాలో నెంబర్ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్-2022 తాజా నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన సంపద 99.7 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, అదానీ సంపద 98.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీ.. అంబానీని దాటి ఆసియా నెంబర్ వన్‌గా నిలిచాడు. ఇప్పుడు అంబానీ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

pawan kalyan: వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలి: పవన్ కళ్యాణ్

మరోవైపు ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్టులో అంబానీనే ముందున్నారు. ఆ సంస్థ అంచనా ప్రకారం ముఖేష్ అంబానీ సంస్థ విలువ 104.7 బిలియన్ డాలర్లు కాగా, అదానీ సంస్థ విలువ 100.1 బిలియన్ డాలర్లు. ఇక, బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం ఎనిమిదికాగా, గౌతమ్ అదానీ స్థానం తొమ్మిది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచింది టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఆయన సంపద 227.5 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండో స్థానంలో జెఫ్ బెజోస్ (149.4 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్ట్ (138.3 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో బిల్‌గేట్స్ (123.6 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో వారెన్ బఫెట్ (114.1 బిలియన్ డాలర్లు) ఉన్నారు.