Campa Cola : కాంపా కోలాపై అంబానీ ఫోకస్ .. ఒకప్పటి బ్రాండ్‌ని రీలాంచ్ చేయడం వెనకున్న స్ట్రాటజీ ఏంటి..?!

నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ మార్కెట్‌లోకి దిగాలని డిసైడ్ అయిన రిలయన్స్.. కొత్తగా సాఫ్ట్ డ్రింక్ తయారుచేయకుండా.. కాంపా కోలాను ఎందుకు కొనుగోలు చేసింది? అంబానీ ఆలోచన వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? కాంపా కోలానే సెలక్ట్ చేసుకొని మరీ.. బేవరేజెస్ ఇండస్ట్రీని ఏలేయడానికి రాబోతున్నారా?

Campa Cola : కాంపా కోలాపై అంబానీ ఫోకస్ .. ఒకప్పటి బ్రాండ్‌ని రీలాంచ్ చేయడం వెనకున్న స్ట్రాటజీ ఏంటి..?!

Mukesh Ambani's focus on Campa Cola

Campa Cola : నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ మార్కెట్‌లోకి దిగాలని డిసైడ్ అయిన రిలయన్స్.. కొత్తగా సాఫ్ట్ డ్రింక్ తయారుచేయకుండా.. కాంపా కోలాను ఎందుకు కొనుగోలు చేసింది? అంబానీ ఆలోచన వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? కాంపా కోలానే సెలక్ట్ చేసుకొని మరీ.. బేవరేజెస్ ఇండస్ట్రీని ఏలేయడానికి రాబోతున్నారా? కోకాకోలా, పెప్సీకి.. దేశీ బ్రాండ్ కాంపానే.. సరైన పోటీ అని డిసైడ్ అయ్యారా?

అంబానీ తీసుకురాబోయే సాఫ్ట్ డ్రింక్.. కొత్త బ్రాండ్ ఏమీ కాదు. ఆల్రెడీ ఉన్న బ్రాండ్‌నే.. కొత్తగా తీసుకురాబోతున్నారు. అదే.. కంపా కోలా. అందుకే.. ఇన్ని సందేహాలొస్తున్నాయ్. ఎందుకంటే.. లక్షల కోట్ల సంపద ఉన్న అంబానీ.. సొంతంగా తనే ఓ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌ని క్రియేట్ చేసి.. మార్కెట్ చేసి.. దానినే.. సేల్ చేయొచ్చు కదా.. అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. కానీ.. రిలయన్స్ కావాలనే కాంపా కోలాను సెలక్ట్ చేసుకుంది. దీని వెనుక చాలా కారణాలున్నాయ్. 1970ల ప్రాంతంలో కాంపా కోలా ఇండియన్ మార్కెట్‌ని ఓ ఊపు ఊపేసింది. కొన్నేళ్ల దాకా భారత సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌లో అదే లీడర్‌గా కొనసాగింది. తర్వాత.. కోకాకోలా, పెప్సీ ధాటికి తట్టుకోలేక వెనుకబడిపోయింది. ఇప్పుడు.. ఆ కంపా కోలాకే గేర్‌ మార్చి మళ్లీ కొత్తగా తీసుకురాబోతున్నారు రిలయన్స్‌ ఛైర్మన్ ముకేశ్ అంబానీ. దీనికైతే.. మళ్లీ రీబ్రాండ్ చేయాల్సిన పనిలేదు. ఆల్రెడీ.. పాపులర్ డ్రింకే కాబట్టి.. కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్.. రీలాంచ్ చేసి.. రిలయన్స్ స్టోర్లలో పెట్టి.. కస్టమర్ల కంటి చూపు దాకా తీసుకెళితే చాలు.

Campa Cola : కాంపా కోలా బ్రాండెడ్ డ్రింక్‌లకు పోటీ కానుందా? పానీయాల మార్కెట్లను ముఖేశ్ అంబానీ షేక్ చేస్తారా..?

ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్ గ్రూప్ నుంచి.. కాంపా, సోస్యో సాఫ్ట్ డ్రింక్‌ బ్రాండ్స్‌ను రిలయన్స్ కొనేసింది. మొత్తం.. 22 కోట్లకు ఈ డీల్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్.. FMCG వ్యాపారంలోకి అడుగుపెడుతున్నామని.. రిలయన్స్ ప్రకటించిన రెండు రోజుల్లోనే.. ఈ డీల్ జరిగింది. కోకాకోలా, పెప్సీకి పోటీగా.. అంబానీ కాంపా కోలాను తీసుకురాబోతున్నారు. 22 కోట్లు అంటే.. అంబానీ లాంటి కుబేరుడికి ఓ లెక్కే కాదు. పైగా.. పాపులర్ బ్రాండ్‌ని.. చాలా తక్కువ మొత్తానికే చేజిక్కించుకున్నారు. దానిని.. రీలాంచ్ చేస్తే.. పెట్టిన డబ్బులు ఈజీగా తిరిగొచ్చేస్తాయ్. తేడా కొట్టినా.. లాస్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. అందుకే.. కాంపా కోలాకు.. రిలయన్స్ టచ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అంబానీ.

అయితే.. కాంపా కోలా గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 1999 ప్రాంతంలో.. కాంపా కోలా డ్రింక్ ప్రొడక్షన్ ఆగిపోయింది. 1970ల చివరలో.. ప్యూర్ డ్రింక్ గ్రూప్ కాంపా కోలాను ప్రారంభించింది. 1977లో.. అప్పటి జనతా ప్రభుత్వం.. ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్స్ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో.. కోకాకోలాను దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశించింది. దీంతో.. కాంపా కోలా ఇండియా మొత్తం పాపులర్ అయింది. భారత సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌లో ఓ లీడర్‌గా అవతరించింది. నిజానికి.. 1949లోనే ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ భారత్‌లో కోకా కోలాను తొలిసారి పరిచయం చేసింది. అప్పుడు.. దేశంలో ఏకైక లైసెన్స్ కలిగి ఉన్న మానుఫాక్చర్, డిస్ట్రిబ్యూటర్ ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ ఒక్కటే.

1977లో కోకాకోలా ఇండియా నుంచి వెళ్లిపోయిన తర్వాత.. పదిహేనేళ్ల పాటు ఢిల్లీ మార్కెట్‌లో కాంపా కోలా హవానే నడిచింది. అప్పట్లో.. ఈ బ్రాండ్ ఇన్ స్టంట్ హిట్. దేశవ్యాప్తంగా 50 ఫ్యాక్టరీల్లో కాంపా కోలా తయారయ్యేది. ఈ డ్రింక్‌కి ఎంత డిమాండ్ ఉండేదంటే.. కాంపా కోలా ఫ్యాక్టరీలు 24 బై 7 రన్ అయినా.. డిమాండ్‌కు తగ్గ ప్రొడక్షన్ జరిగేది కాదు. ఇందుకు.. మెయిన్ రీజన్ ప్యూర్ డ్రింక్ గ్రూప్.. కాంపాను మేడిన్ ఇండియా డ్రింక్‌గా ప్రచారం చేసింది. అంతే కాదు.. గ్రేట్ ఇండియన్ టేస్ట్ అనే క్యాప్షన్‌ని యాడ్ చేసి మార్కెట్‌లోకి వదిలింది. దీంతో.. ప్రతి పెళ్లి పార్టీలో కాంపా కోలా ఉండాల్సిందే అన్నంతగా పాపులర్ అయింది.

Campa Cola: క్యాంపా‌కోలా మళ్లీ వచ్చేస్తోంది..! దీపావళి నుంచి మార్కెట్‌లోకి..? ఈసారి మూడు రుచుల్లో..

పార్లే గ్రూప్ 1990లో థమ్సప్, గోల్డ్ స్పాట్, లిమ్కాను తీసుకొచ్చింది. దీంతో.. కాంపా కోలాకు.. థమ్సప్ మాత్రమే పోటీగా ఉండేది. అయితే.. ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌లోకి.. పెప్సీ ఎంట్రీ ఇవ్వడం, 1993లో కోకా కోలా రీఎంట్రీ ఇవ్వడంతో.. కాంపా కోలా సేల్స్ క్రమంగా పడిపోయాయ్. పార్లేకు చెందిన ఆగ్రో బ్రాండ్లను కోకా కోలా కొనుగోలు చేసిన తర్వాత దూకుడుగా మార్కెటింగ్ చేసుకోవడంతో.. కాంపా కూల్ డ్రింక్స్ మార్కెట్ నుంచి కనురుగైపోయాయి. ఆ తర్వాత.. చాలాసార్లు మార్కెట్‌లోకి తిరిగి రావడానికి ప్రయత్నించినా.. అవేవీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు.. రిలయన్స్ లాంటి దిగ్గజ కంపెనీ కొనుగోలు చేయడంతో.. మళ్లీ కాంపా కోలా మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

ప్రస్తుతం.. టూత్ పేస్టుల దగ్గరి నుంచి సబ్బులు, కూల్ డ్రింక్స్ దాకా అన్నింటిని.. రిలయన్స్ ఇతర సంస్థల నుంచి కొని తమ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తోంది. కోకాకోలా, పెప్సీ బ్రాండ్లను కూడా రియలన్స్ స్టోర్లలో అమ్ముతున్నారు. అందువల్ల.. వేగంగా విస్తరిస్తున్న FMCG లోకి అడుగు పెట్టాలని రిలయన్స్ కాంపా కోలాను కొనుగోలు చేసింది. కాంపా కోలా డ్రింక్‌ని.. మొత్తం మూడు ఫ్లేవర్లలో రీలాంచ్ చేయాలని చూస్తున్నారు. ఐకానిక్ కాంపా కోలా ఒరిజినల్‌తో పాటు లెమన్, ఆరెంజ్ వేరియంట్స్‌లో సాఫ్ట్ డ్రింక్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. జియో మార్ట్, కిరాణా స్టోర్స్, రిలయన్స్ రిటైల్స్‌లో.. వీటిని విక్రయిస్తారు. వచ్చే దీపావళికే.. కాంపా కోలాను.. ఇండియాతో తాగించేందుకు రిలయన్స్ అంతా సిద్ధం చేస్తోంది.