Multana Matti : చర్మసౌందర్యానికి ముల్తానా మట్టి

ముల్తానీ మట్టిలో చెంచా చొప్పున తులసిపొడి, గంధంపొడి వేసి, తగినన్ని పచ్చిపాలు పోసి పేస్టులా చేయాలి. ఈ పేస్టును రోజూ రాత్రిపూట ముఖానికి రాసుకొని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడి

Multana Matti : చర్మసౌందర్యానికి ముల్తానా మట్టి

Multhana Mitti

Multana Matti : చర్మానికి ముల్తానా మట్టి చేసే మేలు అంతాఇంతాకాదు. బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో ఈ ముల్తానా మట్టిని ఎక్కవగా వాడతారు. ఎలాంటి రసాయనాలు లేని ఈ స్వచ్ఛమైన మట్టిలో ఉండే సహజ ఖనిజాలే చర్మానికి రక్షణ కలిగిస్తాయి. పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో లభించే మట్టి మాత్రమే చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు మేలైనదని అంతా భావిస్తుంటారు. ఈక్రమంలోనే ముల్తాన్‌లో లభించే మట్టి పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందుకే ఈ మట్టిని ముల్తానీ మిట్టీగా పిలుస్తారు.

ముల్తానీ మట్టిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మట్టి ఎక్కువగా ఫౌడర్ రూపంలో దొరుకుతుంది. తెలుపు, నీలం, ఆకుపచ్చ, గోదుమ రంగుల్లో ఎక్కువగా లభిస్తుంది.  చర్మాన్ని జిడ్డులా మార్చే నూనెలను ఈ మట్టి పీల్చుకుంటుంది. చర్మ రంథ్రాల్లో పేరుకునే క్లాగ్ ను తొలగిస్తుంది. చర్మం పీహెచ్ స్థాయిలను బ్యాలెన్సింగ్ చేయటానికి బాగా దోహద పడుతుంది.

ఎక్కువ మంది దీన్ని ఫేస్‌ప్యాక్‌గా వాడతారు. చర్మంపై మచ్చలను తొలగించటంలో మంచి సహాయకారిగా పనిచేస్తుంది. ఎండలో బాగా తిరిగివచ్చాక ముఖం కమిలిపోయినట్టుగా, నల్లగా అవుతుంది. అలాంటప్పుడు ముల్తానీ మట్టిలో రోజ్‌వాటర్‌ పోసి ఫేస్‌ మాస్కులా వేసుకుంటే ఫలితం ఉంటుంది. ముఖం తేజస్సుతో నిగనిగలాడుతుంది. ముల్తానీ మట్టిలో చెంచా చొప్పున తులసిపొడి, గంధంపొడి వేసి, తగినన్ని పచ్చిపాలు పోసి పేస్టులా చేయాలి.

ఈ పేస్టును రోజూ రాత్రిపూట ముఖానికి రాసుకొని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై మొటిమల తాలుకు మచ్చలు పోయి చర్మం నిగారింపును పొందుతుంది.అరకప్పు ముల్తానీ మట్టి, కోడిగుడ్డు తెల్లసొన, ఒక చెంచా ఓట్స్‌, రెండు చెంచాల టొమాటో గుజ్జును ఒక గిన్నెలో వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి పూసుకుని పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ముఖానికి బాదం నూనె రాసుకుంటే ముఖం నిగ నిగలాడుతుంది.

ముల్తానీ మట్టిలో ఒకస్పూను బాదం నూనె, ఒక స్పూను తేనె, అరస్పూను మీగడ, రోజ్‌వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకొని పూర్తిగా పొడిబారక ముందే చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.డార్క్ స్కిన్‌తో బాధపడేవారికి ఇది ఉపయోగపడుతుంది. మరీ తెల్లగా మార్చుకున్నా.. చర్మాన్ని కాంతివంతంగా కనిపించేందుకు సహకరిస్తుంది. చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. చుండ్రుకు కారణమయ్యే గ్రీజు, దూళిని ఈ మట్టి గ్రహిస్తుంది. తల చర్మంలోని రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.