Rich pigeonsin : పావురాల పేరు మీద రూ. కోట్ల ఆస్తులు..బ్యాంకులో భారీ మొత్తంలో డిపాజిట్లు

జస్నాగర్ గ్రామంలో ఉండే పావురాలు పేరు మీద ఏకంగా కోట్ల రూపాయలు విలవ చేసే ఆస్తులున్నాయి. దీంతో ఆ పావురాలను గ్రామస్తులు మల్టీ మిలయనియర్ పావురాలు అని పిలుస్తుంటారు. ఇంత భారీగా ఆస్తులు పావురాల పేరు మీద కోట్లు విలువ చేసే ఆస్తులు ఉండటం వెనుక ఆసక్తికర విషయమే ఉంది.

Rich pigeonsin : పావురాల పేరు మీద రూ. కోట్ల ఆస్తులు..బ్యాంకులో భారీ మొత్తంలో డిపాజిట్లు

Rich Pigeonsin

Multi millionaire pigeons : రాజస్థాన్ లోని జస్నాగర్ గ్రామానికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. ఆ గ్రామంలో ఉండే పావురాలే ఆ గ్రామాన్ని వెలుగులోకి తెచ్చాయి. నాగౌర్ నగర పరిధిలో ఉండే జస్నాగర్ గ్రామంలో ఉండే పావురాలు కోట్లకు పడగలెత్తాయి. వాటి పేరు మీద ఏకంగా కోట్ల రూపాయలు విలవ చేసే ఆస్తులున్నాయి. దీంతో ఆ పావురాలను గ్రామస్తులు మల్టీ మిలయనియర్ పావురాలు అని పిలుస్తుంటారు. ఈ పావురాల పేరు మీద 30 ఎకరాలకు పైగా భూమి, 27 షాపులు,బ్యాంకుల్లో భారీగా క్యాష్ డిపాజిట్లు ఉన్నాయి. వీటి ఆస్తుల విలువ ఇప్పుడు కోట్లల్లో ఉంది. ఇంత భారీగా ఆస్తులు పావురాల పేరు మీద కోట్లు విలువ చేసే ఆస్తులుండటమేంటీ? అసలు ఎవరు వీటికి ఆస్తులు రాసిచ్చారు?దీని వెనుక ఉన్న ఆ ఆసక్తికర విషయం ఉంది.

దీనికి కారణం పావురాలపై ప్రేమ పెంచుకున్న ఓ వ్యాపారవేత్త. 40 ఏళ్ల క్రితం జస్నాగర్ గ్రామానికి సజ్జన్ రాజ్ జైన్ అనే వ్యాపారవేత్త వచ్చాడు. పావులను సంరక్షించటానికి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీంతో జస్నాగర్ గ్రామ ప్రజలు కూడా పావురాలను సంరక్షణలో పాలుపంచుకుంటామంటూ ట్రస్ట్ తో కలిసి పనిచేయటం ప్రారంభించారు. కేవలం పావురాలను సంరక్షించటమే కాకుండా గ్రామ ప్రజలు విరాళాలు కూడా ఇచ్చారు. అలా వచ్చిన విరాళాలతో అప్పట్లో వ్యవసాయ భూములు,షాపులు కొన్నారు. ఆ భూములపై వచ్చిన ఆదాయాన్ని..షాపులు అద్దెకు ఇవ్వగా వచ్చిన డబ్బుని బ్యాంకులో జమ చేస్తున్నారు ట్రస్ట్ పేరుతో ఉన్నఎకౌంట్ లో.

అలా బ్యాంకులో డబ్బు పెరిగింది. ప్రతీ ఏటా పెరుగుతునూ ఉంది. వ్యవసాయం భూముల ధరలు పెరిగాయి. షాపుల అద్దె విలువా పెరిగింది. అలా పెరిగి కోట్ల రూపాయల విలువకు చేరుకున్నాయి పావురాల ఆస్తులు. పావురాల పేరు మీద ఉన్న షాపుల అద్దెలు నెలకు రూ.80వేలు వస్తున్నాయి. అవన్నీ బ్యాంకులో జమ అవుతున్నాయి. అలా భూములు, షాపుల మీద వచ్చిన డబ్బు ఇప్పుడు బ్యాంకులో రూ.80లక్షల ఫిక్సిడ్ డిపాజిట్స్ ఉన్నాయి. వీటన్నింటి మీద వచ్చిన ఆదాయంతో పావురాలకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు గ్రామస్తులు.

వాటికి నీరు, ఆహారం సమకూరుస్తున్నారు ట్రస్ట్ నిర్వాహకులు. పావురాల పేరుమీద ఉన్న 10 ఎకరాల భూముల్లో గోశాలన్ని ఏర్పాటు చేసి 500 గోవుల్ని సంరక్షిస్తున్నారు ట్రస్ట్ నిర్వాహకులు. వాటి కోసమే కాకుండా గ్రామంలో ఉండే పశువుల కోసం ఓ పశువుల ఆస్పత్రిని కూడా ఏర్పాటుచేశారు. పావురాల సంరక్షణలు ఇలా కొనసాగిస్తామని చెబుతున్నారు ట్రస్ట్ నిర్వాహకులు.