Mumbai Airport: దేశంలోనే వైండ్ ఎనర్జీ వాడే తొలి ఎయిర్‌పోర్ట్

గ్రీన్ ఇండియాలో మరో అడుగు ముందుకేస్తూ.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వర్టికల్ యాక్సిస్ వైండ్ టర్బైన్, సోలార్ పీవీ హైబ్రిడ్ (సోలార్ మిల్)ను లాంచ్ చేయనుంది.

Mumbai Airport: దేశంలోనే వైండ్ ఎనర్జీ వాడే తొలి ఎయిర్‌పోర్ట్

Mumbai Airport

Mumbai Airport: గ్రీన్ ఇండియాలో మరో అడుగు ముందుకేస్తూ.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వర్టికల్ యాక్సిస్ వైండ్ టర్బైన్, సోలార్ పీవీ హైబ్రిడ్ (సోలార్ మిల్)ను లాంచ్ చేయనుంది. ఎయిర్‌పోర్ట్ అవసరాల నిమిత్తం వైండ్ ఎనర్జీ వాడుకుంటున్న తొలి ఎయిర్‌పోర్ట్ ఇదే కావడం విశేషం.

ఎయిర్‌పోర్టు 24 గంటల్లో ఇంధన ఉత్పత్తిని నెలకొల్పడానికి, పవన విద్యుత్ వ్యవస్థల ద్వారా గరిష్ట శక్తిని వినియోగించుకోవడానికి పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అదే సమయంలో విమానయాన రంగంలో అత్యంత సమర్థవంతమైన, తక్కువ కార్బన్ భవిష్యత్తును కూడా అనుమతిస్తుంది.

“విమానాశ్రయం చేపట్టిన ఈ ప్రయోగం సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది” అని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) ప్రతినిధి తెలిపారు.

Read Also: హైదరాబాద్.. ఢిల్లీ.. బెంగళూరు.. ముంబై.. అమ్మకానికి విమానాశ్రయాలు..

“గ్రీన్ ఎనర్జీ సామర్థ్య వినియోగాన్ని పెంపొందించడంలో సహాయపడటానికి, CSMIA 2 Kwp టర్బో మిల్లు (3 Savonius రకం VAWT) 8 Kwp సోలార్ PV మాడ్యూల్‌లతో కూడిన 10Kwp హైబ్రిడ్ సోలార్ మిల్లును నెలకొల్పింది. దీంతో రోజుకు కనీసం 36 Kwh శక్తి ఉత్పత్తి అవుతుంది” అని ముంబై విమానాశ్రయ అధికారి తెలిపారు.