Sukhant Funeral: అంత్యక్రియలకూ అడ్వాన్స్ బుకింగ్.. కర్మకాండ వరకు అన్ని పనులూ చేస్తామంటున్న స్టార్టప్

అంత్యక్రియల దగ్గరి నుంచి అస్థికల నిమజ్జనం వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొచ్చిందో సంస్థ. డబ్బులిస్తే చాలు.. అన్ని పనులూ తామే చేసి పెడతామని చెబుతోంది.

Sukhant Funeral: అంత్యక్రియలకూ అడ్వాన్స్ బుకింగ్.. కర్మకాండ వరకు అన్ని పనులూ చేస్తామంటున్న స్టార్టప్

Sukhant Funeral అంత్యక్రియల నుంచి కర్మకాండలు, అస్థికల నిమజ్జనం వరకు అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ చేసేందుకు ఈ మధ్య కాలంలో చాలా మందికి టైమ్ ఉండటం లేదు. అందుకే డబ్బులిస్తే చాలు.. అన్ని పనులూ తామే చేసి పెడతామంటూ ముందుకొచ్చింది ఒక సంస్థ.

Elon Musk: రోజురోజుకూ తగ్గిపోతున్న ఎలన్ మస్క్ సంపద.. ట్విట్టరే కారణమా?

‘సుఖాంత్ ఫ్యునెరల్’ అనే సంస్థ ఇటీవల ఈ సేవలు ప్రారంభించింది. ఈ సంస్థ సేవలు మొదలవ్వడానికి ఒక కారణం ఉంది. రెండేళ్లక్రితం కోవిడ్ సమయంలో ఎందరో మరణించారు. వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు అప్పట్లో కుటుంబ సభ్యులు కూడా ముందుకురాని పరిస్థతి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలే ఈ పని చేశాయి. ఇప్పటికీ కొందరి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. కుటుంబ సభ్యులు దూరంగా విదేశాల్లో ఉండటం, ఇతర కారణాల వల్ల అంత్యక్రియలకు హాజరవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో చుట్టుపక్కల వాళ్లు, ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అయితే, ఇకపై ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ తామే చూసుకుంటామని చెబుతోంది ‘సుఖాంత్ ఫ్యునెరల్’.

Malla Reddy: బీజేపీ కుట్రలో భాగంగానే మాపై దాడులు.. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు: మంత్రి మల్లారెడ్డి

అంత్యక్రియలు, ఈ తతంగం అంతా నిర్వహించే వీలు లేని వాళ్లు డబ్బులు చెల్లిస్తే చాలు. ప్రతిదీ ఈ సంస్థే చూసుకుంటుంది. అది కూడా వారివారి సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇంటి దగ్గరి నుంచి శవాన్ని తీసుకెళ్లడం దగ్గరి నుంచి అంత్యక్రియలు, పూజారి, బంధువుల ఏర్పాటు, అవసరమైతే అస్థికల నిమజ్జనం వంటి కార్యక్రమాలు కూడా కంపెనీ చేపడుతుంది. ఒక్కో రకమైన సేవకు ఒక్కో ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.37,500 వరకు వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ముంబై, నవీ ముంబై ప్రాంతాల్లోనే సేవలు అందిస్తోంది. అయితే, త్వరలో దేశమంతా తమ సేవలు విస్తరిస్తామని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి సంస్థ వివిధ ప్యాకేజీలు ప్రకటించింది.

ముందుగా ప్లాన్ చేసుకున్న వాటికి రూ.40,000 వరకు వసూలు చేస్తోంది. అంతేకాదు.. ఎవరైనా అంత్యక్రియల కోసం ముందుగా అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. వారికి ఎలా కావాలో ముందుగానే నిర్ణయించుకుని చెబితే, దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తమ చివరి యాత్ర ఎలా ఉండాలో చెబితే దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే పత్రికా ప్రకటనలు కూడా ఇస్తారు. అయితే, ఈ వింత స్టార్టప్ అందిస్తున్న సేవల విషయంలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.