కూతుర్ని అత్యాచారం చేసినవాడిని విడుదల చేయాలని కోరిన తల్లి..సరేనంటూ బెయిల్ ఇచ్చిన కోర్టు

కూతుర్ని అత్యాచారం చేసినవాడిని విడుదల చేయాలని కోరిన తల్లి..సరేనంటూ బెయిల్ ఇచ్చిన కోర్టు

Mumbai : కన్నకూతుర్ని అత్యాచారం చేసినవాడికి కఠినమైన శిక్ష పడాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఢిల్లీలో నిర్భయ ఘటనలో ఆమె తల్లి సంవత్సరాల తరబడి పోరాడి తన కూతురిపై సామూహిక అత్యాచారం చేసినవారికి ఉరిశిక్ష పడేదాకా పోరాడిన విషయంతెలిసిందే. కానీ ఓ తన 16 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన దుర్మార్గుడికి బెయిల్ ఇప్పించమంటూ వేడుకుందో తల్లి.

కోర్టులో అఫిడవిట్ దాఖలుచేసి తన కూతురిని గర్భవతిని చేసి 25 ఏళ్ల యువకుడికి బెయిల్ ఇప్పించాలని కోరింది. నిందితుడి తరపున వకాల్తా పుచ్చుకుని అతడిని విడుదల చేయాల్సిందిగా కోరింది. కానీ అతనిపై కేసు బుక్ చేసి రిమాండ్ కు పంపించిన పోలీసులు మాత్రం నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుని కోరటం మరో విశేషం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..కోర్టు కూడా సదరు బాలిక తల్లి వాదనలను పరిగణనలోకి తీసుకుంది. నిందితుడికి బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. ముంబైలో జరిగిన ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..

ముంబైలో ఉంటున్న ఓ 25ఏళ్ల యువకుడికి పెళ్లయింది. కానీ భార్యకంటే వేరే అమ్మాయిలమీదనే మోజు ఎక్కువ. ఆడపిల్లకనిపిస్తే చాలు వెర్రెత్తిపోతాడు. ఈక్రమంలో సదరు యువకుడికి తెలిసిన వ్యక్తి ఇంటికి తరచూ వెళ్లేవాడు. అతని కన్ను ఆ వ్యక్తి 16ఏళ్ల కూతురుమీద పడింది. చక్కగా మాటల కలిపేవాడు. ఎన్నో విషయాలు చెప్పేవాడు. సరదా సరదాగా ఉండేవాడు. కల్లబొల్లిమాటలెన్నో చెప్పేవాడు. మాయ మాటలు చెప్పి నమ్మించాడు. నువ్వు చాలా అందంగా ఉంటావు..నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. 16ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మాయికి అదో అద్భుతంగా అనిపించింది.

పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పి..బాలికను లొంగదీసుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. దీంతో ఈ విషయం ఇంట్లో తెలిసింది. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ముంబై పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు అతను ముంబై ఫోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటీషన్ ని కోర్టు కొట్టేసింది. కొద్ది నెలలు ఆగి మరోసారి బెయిల్ పిటిషన్ ను పెట్టుకున్నాడు. దీనిపై కోర్టు విచారించనుంది. ఈ క్రమంలో ‘అతడిని బెయిల్ పై విడుదల చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఊహించిన ఈ ఘటనపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అతడు కోర్టులో బెయిల్ పిటిషన్ ను వేయడానికి ముందే బాధితురాలి తల్లితో ఓ డీల్ కుదుర్చుకున్నాడు. ఆ డీల్ ప్రకారం..మీ కూతురికి ఇప్పుడు ఉన్న గర్భం తీయించేస్తే..ఆమె ఇప్పుడు మైనర్ కాబట్టి..ఆమెకు 18 ఏళ్ల వయసు నిండగానే పెళ్లి చేసుకుంటా‘ అని ఆ బాలిక తల్లిదండ్రులతో అతడు డీల్ కుదుర్చుకున్నాడు. దీనికి బాలిక తల్లిదండ్రులు కూడా సరేనన్నారు. దీంతో అతడినే పెళ్లి చేసుకోవాలని తన కూతురు కోరుకుంటోందనీ..అతడికి బెయిల్ ఇవ్వాలని బాధితురాలి తల్లి కోర్టుకు సమర్పించుకున్న అఫిడవిట్ లో పేర్కొంది. కానీ పోలీసులు మాత్రం విచారణ జరుగుతున్న సమయంలో అతడికి బెయిల్ ఇవ్వొద్దంటూ అఫిడవిట్ దాఖలు చేశారు.

కానీ కోర్టు మాత్రం బాలిక తల్లి వేసిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకుంది. అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడికి సంబంధించిన మతం బహుభార్యత్వానికి అంగీకరిస్తుందని ఆ బాలికను మరోవివాహం చేసుకోవటం మంచిదేనంటూ వ్యాఖ్యానించించటం విశేషం.