నాలుగేళ్ల పసిపాపను లైంగికంగా వేధించిన 80 ఏళ్ల వృద్ధ దంపతులకు 10ఏళ్ల జైలు

నాలుగేళ్ల పసిపాపను లైంగికంగా వేధించిన 80 ఏళ్ల వృద్ధ దంపతులకు 10ఏళ్ల జైలు

Mumbai 4 Years Girl Child Abu

80 years old couple 4 years girl sexually abus 10 year jail  : నాలుగు సంవత్సరాల పసిపాపను 80 ఏళ్లు పైబడిన దంపతులు ఎలా చూసుకోవాలి? మనుమరాలిలా ముద్దుచేయాలి? వాత్సల్యంగా చూసుకోవాలి. కానీ ముంబైకు చెందిన 80 ఏళ్లున్న ఓ వృద్ధ దంపతులు నాలుగు ఏళ్లును ఓ పాపను లైంగికంగా వేధించారు. హింసించారు. తనపై ఆ వృద్ధులు ఏం చేస్తున్నారో కూడా తెలియని ఆ పసిపాప బిక్క మొహం వేసింది. ఏడ్చింది.

ఏంటో తెలియకపోయినా వచ్చీరాని మాటలతో అమ్మతో చెప్పింది. దీంతో తన చిన్నారిపై పిచ్చి చేష్టలకు పాల్పడిన ఆ వృద్ధ జంటపై ఆ తల్లి ఫిర్యాలు చేయటంతో ఈ కేసును విచారించిన న్యాయస్థనం ఏడేళ్లకు తీర్పునిచ్చింది. 2013లో చిన్నారిపై వృద్ధ దంపతులు చేసిన లైంగిక వేధింపులకు 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. లక్ష జరిమానా విధించింది.

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గిర్గావ్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జంట 2013లో ఈ దారుణానికి పాల్పడింది. పొరుగున ఉన్న నాలుగేళ్ల బాలికను ముద్దు చేస్తున్నట్లుగా నటించి తమ ఇంటికి పిలిపించి ఆ పసిబిడ్డను లైంగికంగా వేధించారు. బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 6 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఈ కేసుపై విచారణ జరిపిన పోక్సో ప్రత్యేక కోర్టు బాధిత బాలిక, తల్లి వాంగ్మూలం, వైద్య రిపోర్టుల ఆధారంగా ఆ వృద్ధ జంట ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించింది. 87 ఏళ్ల తాత, 81ఏళ్ల బామ్మ వయసున్న వారు బాలికను ప్రేమతో చూసుకోవాల్సిందిపోయి లైంగికంగా వేధింపులకు గురి చేయడాన్ని ఖండించిన కోర్టు తీవ్రంగా పరిగణించింది. వారిని దోషులుగా నిర్ధారిస్తూ..పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి రేఖ పంధారే ఆ వృద్ధ జంటకు పదేండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ గురువారం (మార్చి 11,2021)తీర్పు వెల్లడించారు.