Mumbai Police : ధోని గురించి పోలీసులు ఏం చెప్పారంటే?

ఎమ్మెస్ ధోని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ద్వారా వాళ్లు ధోనీ గురించి ఏం చెప్పారు?

Mumbai Police : ధోని గురించి పోలీసులు ఏం చెప్పారంటే?

Mumbai Police

Mumbai police about Dhoni : ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రజలకు చైతన్యం కలిగించే పలు విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఎమ్మెస్ ధోనీ గురించి షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.

ఐపిఎల్ 16వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. పలు వేదికలపై మ్యాచ్ గురించి ప్రజలు తమ భావాలను వ్యక్తీకరించారు. ఈ పోస్ట్‌లు ఓ వైపు వైరల్ అవుతుంటే తాజాగా ముంబయి పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో ఒకటి అందరి మనసుల్ని గెలుచుకుంది. CSK కెప్టెన్ MS ధోని నుండి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ డిపార్ట్ మెంట్ షేర్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది.

helmetless cops : హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన మహిళా పోలీసులు ఫోటో వైరల్

కెమెరా వైపు తిరిగి ఉన్న ఫోటోను షేర్ చేసారు. ఆ ఫోటోలో ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తుంది. అక్కడ మామూలు లైట్స్‌కి బదులు ట్రాఫిక్ లైట్‌లో కొన్నిఎమోజీలు కనిపిస్తాయి. ‘ఆగండి.. ఆలోచించండి. ఆ తరువాత కదలండి.. ఛాంపియన్‌లు ఎప్పుడూ నిబంధనలు ఫాలో అవుతూ ఆడతారు. నియమాలను ఉల్లంఘించరు’ అనే శీర్షికతో షేర్ చేసిన ఫోటోని ధోనీకి ట్యాగ్ చేశారు.

Mumbai police band : ముంబయి పోలీస్ బ్యాండ్ మామూలు పాట వాయించలేదుగా !!

ఈ పోస్ట్ పై నెటిజన్లు ‘గొప్ప అవగాహన కల్పించే ప్రయత్నం అని’ కామెంట్ చేశారు. చాలామంది హార్ట్ ఎమోజీలను చూపిస్తూ నిజంగానే ధోనీ లాంటి గొప్ప క్రికెటర్ నుండి స్ఫూర్తి పొందాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని వాటిని ఈ ఫోటో ద్వారా ముంబయి పోలీసులు మరొక్కసారి చాటి చెప్పారని అభిప్రాయపడ్డారు.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Police (@mumbaipolice)