Covid In Mumbai : ముంబైలో కోవిడ్ సునామీ..వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళే అత్యధిక కేసులు

ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో బుధవారం నమోదైన కోవిడ్ కేసులు(15,166)కంటే ఇవాళ 25శాతం అధికంగా కేసులు

Covid In Mumbai : ముంబైలో కోవిడ్ సునామీ..వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళే అత్యధిక కేసులు

Covid8

Covid In Mumbai : ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో బుధవారం నమోదైన కోవిడ్ కేసులు(15,166)కంటే ఇవాళ 25శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి.

ముంబైలో గత 24 గంటల్లో 20,181 కొత్త కోవిడ్ కేసులు,4 మరణాలు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన 2020 మార్చి నుంచి ముంబైలో ఒక్కరోజులో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇవే అత్యధికం. అయితే ఇవాళ నమోదైన కేసుల్లో 85శాతం అసింప్టమాటిక్(రోగ లక్షణాలు లేని)అని అధికారులు తెలిపారు. ముంబైలో ఇవాళ కోవిడ్ పాజిటివిటీ రేటు 29.9శాతంగా ఉంది.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC)తెలిపిన వివరాల ప్రకారం..గురువారం ముంబైలో మొత్తం 67వేల శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు. ఇక,ప్రస్తుతం ముంబైలో 79,260 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. కాగా, రికార్డు స్థాయిలో భారీగా కోవిడ్ కేసులు నమోదుకావడం ముంబై వాసులను టెన్షన్ పెడుతోంది. మరోవైపు,కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటికే ముంబైలో ఆంక్షలు విధించారు అధికారులు.

ALSO READ Covid In Delhi : ఢిల్లీలో కోవిడ్ విజృంభణ..భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు