కౌగలించుకుంటే నేరమే గానీ..బుగ్గలు గిల్లితే నేరం కాదు : ముంబై కోర్టు మరో సంచలన తీర్పు

కౌగలించుకుంటే నేరమే గానీ..బుగ్గలు గిల్లితే నేరం కాదు : ముంబై కోర్టు మరో సంచలన తీర్పు

Mumbai court touching 5 Years girl cheek is not pocso act : ఐదేళ్ల బాలిక చేతులు కట్టేసి పట్టుకుని, ప్యాంటు జిప్‌ తెరచినా అది లైంగిక వేధింపుల చట్టం కిందరాదని అదేమీ నేరం కాదని ముంబై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి తెలిసిందే. దీనిపై భిన్నవాదనలు కొనసాగుతున్న క్రమంలో ముంబైలోని ఓ స్పెషల్ కోర్టు ఇచ్చిన మరో తీర్పు చర్చనీయాంశంగా మారింది.

2017 జూన్ 2న 29ఏళ్ల ఎలక్ట్రీషియన్ ఓ ఇంటికి ఫ్రిజ్ రిపేర్ చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో 33 ఏళ్ల మహిళ, ఆమె ఐదు సంవత్సరాల కుమార్తె మాత్రమే ఉన్నారు. ఇంటికి వచ్చిన ఎలక్ట్రిషియన్ కు ఫ్రిజ్ సమస్య గురించి వివరంగా చెప్పిన తరువాత సదరు మహిళ..కిచెన్ లోకి వెళ్లింది.

ఫ్రిజ్ రిపేర్ కోసం వచ్చిన ఆ వెళ్లిన ఎలక్ట్రీషియన్ ఇంటిని పరిశీలించాడు. ఇంట్లో ఆమె ఓ చిన్నపాప తప్ప మరెవ్వరూ లేరని గ్రహించాడు. ఆమె ఒంటరిగా కూతురితో ఉండడాన్ని గమనించినవాడికి దుర్భుద్ధి బైటపడింది. అక్కడే ఉన్న ఐదేళ్ల పాప దగ్గరకెళ్ళి అసభ్యంగా తడిమాడు.బుగ్గలు గిల్లాడు. ఆ తరువాత ఇంట్లో మగవారు ఎవరూ లేరని పూర్తిగా నిర్ధారించుకుని..మెల్లగా కిచెన్ లోకి వెళ్లాడు.

వంటింటిలో ఏదో పనిచేసుకుంటున్న ఆమెను వెనుక నుంచి గట్టిగా కౌగిలించుకున్నాడు. సడెన్ గా వెనక ఎవరో పట్టుకున్నారని గుర్తించి తేరుకునేలోపే ఆమెను ఇష్టమొచ్చినట్లుగా ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి తడిమేశాడు. ఆ హఠాత్ పరిణామంలోంచి తేరుకున్న ఆమె వెంటనే అతడిని తోసేసింది. హడలిపోయింది. ఏం చేయాలో కాసేపు తెలియలేదు. కాళ్లూ చేతులు వణికిపోయాయి. అలా ధైర్యం తెచ్చుకుని వాడిని గట్టిగా తోసేసి చేతికి ఏమన్నా దొరుకుతాయేమోనని వెతికింది. కానీ ఆ భయాందోళనలో ఏమీ చేయలేకపోయింది.

ఈ కోపంతో అతడి మీద గట్టిగా అరుస్తూ ఇంట్లో నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించింది. అయినా ఆ ఎలక్ట్రీషియన్ ఆమెను వదల్లేదు. మరోసారి ఆమెను ముందు నుంచి కౌగిలించుకున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు. ఎలాగోలా అతడిని వదిలించుకుంది. బైటకు గెంటేసి తలుపులు వేసేసుకుంది.

వెంటనే ఫోన్ అందుకుని ఆ ఎలక్ట్రీషియన్ పనిచేసే సంస్థ సూపర్ వైజర్‌కు, తనసోదరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. సడెన్ గా తన ఐదేళ్ల బిడ్డ గుర్తుకొచ్చింది. కూతురు హాలులోనే ఉండటంతో గబగబా వెళ్లి గుండెలకు హత్తుకుంది. పాప అప్పటికే బెదిరిపోతూ కనిపించేసరికి వాడే ఏదో చేసుంటాడని గ్రహించి ‘ ఏం జరిగింది బంగారం అని అడిగింది. దాంతో ఆ చిన్నారి బిక్క మొహం వేసుకుని జరిగింది చెప్పింది. దాంతో సదరు ఎలక్ట్రిషియన్ పై కోపం తారస్థాయికి చేరుకుందామెకు. కానీ ఏం చేయలేని పరిస్థితి.

బాధితురాలి ఫోన్ సమాచారంతో ఆమె సోదరి పోలీసులకు విషయం చెప్పటంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి..ఎలక్ట్రీషియన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. మంగళవారం (జనవరి2) తీర్పునిస్తూ.. ఆ మహిళ పట్ల అతడు ప్రవర్తించినది నేరంగా పరిగణించింది. కానీ..అదే సమయంలో ఆమె ఐదేళ్ల కుమార్తెతో ఎలక్ట్రిషన్ వ్యవహరించిన తీరు పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని చెప్పింది.

చిన్నారి విషయంలో ఎలక్ట్రిషియన్ ను నిర్ధోషిగా తేల్చింది కోర్టు. కానీ మహిళ పట్ల వ్యవహరించిన తీరు నేరమని పరిగణించి సంవత్సరం జైలుశిక్ష..రూ.10,000లు జరిమానా విధించింది. దీంతో ఆ తల్లికి దిమ్మ తిరిగిపోయింది. చిన్నారులకు ఏదన్నా జరిగాక అది నేరం అని అంటే మాత్రం..సదరు వ్యక్తికి శిక్ష వేస్తే ఉపయోగం ఏంటీ అంటూవాపోయింది.