Rehana Shaikh : 50మంది పేద పిల్లలను దత్తత తీసుకున్న మహిళా కానిస్టేబుల్

కరడు కట్టిన ఖాకీ డ్రెస్ వెనుక మానవత్వం..అమ్మతనం ఉంటుందని నిరూపించింది ఓ మహిళా కానిస్టేబుల్. ముంబై కు చెందిన షేక్ రెహానా అనే ఓ మహిళా 50మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారిని చదివిస్తున్నారు. షేక్ రెహానా తన డ్యూటీ చేస్తూనే పేద పిల్లల పాలిట అమ్మగా మారారు. 50మంది నిరుపేద చిన్నారులను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. అంతేకాదు వారిని చదివిస్తున్నారు.

Rehana Shaikh : 50మంది పేద పిల్లలను దత్తత తీసుకున్న మహిళా కానిస్టేబుల్

Mumbai Lady Cop Rehana Shaikh

Mumbai women constable Rehana Shaikh: కరడు కట్టిన ఖాకీ డ్రెస్ వెనుక మానవత్వం..అమ్మతనం ఉంటుందని నిరూపించారు ఓ మహిళా కానిస్టేబుల్. ముంబై కు చెందిన షేక్ రెహానా అనే ఓ మహిళా 50మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారిని చదివిస్తున్నారు.షేక్ రెహానా తన డ్యూటీ చేస్తూనే పేద పిల్లల పాలిట అమ్మగా మారారు. 50మంది నిరుపేద చిన్నారులను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. అంతేకాదు వారిని చదివిస్తున్నారు. ఈ బాలబాలికలందరూ ఒకే స్కూల్ కు చెందిన వారు. వారిని దత్తత తీసుకున్న రెహానా తనకు చిన్న ఖాళీ సమయం దొరికినా ఈ చిన్నారుల ముందు వాలిపోతారు. వారికి ఎన్నో గిఫ్టులు తీసుకొస్తారు. రకరకాల ఆహారాలు వండుకుని తీసుకొచ్చి వారికి తినిపిస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు. రెహానా భర్త కూడా పోలీస్ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. భర్త సహకారంతో రెహానా పేద పిల్లలను దత్తతతీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్నారు.

ఎవరైనా ఓ మంచి పని చేశారు అంటూ దాని వెనుక ఎవరోకరు స్ఫూర్తి ఉంటుంది. రెహానా కూడా అంతే..రెహానా కూతురు పుట్టిన రోజున ఓ స్నేహితురాలు చూపించిన ఫోటోలు చూసి చలించిపోయారు. ఆ ఫొటోలు ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పేద చిన్నారులవి. ఆ ఫోటోలు చూసిన రెహానా తల్లడిల్లిపోయారు. ఇంత పేదరికంతో ఎలా జీవిస్తున్నారు? వారు ఎలా చదువుకుంటున్నారు? అని ఆలోచించారు. అలా ఆ స్కూల్ కు వెళ్లి వారి గురించి తెలుసుకున్నారు. ఎంతో కష్టంగా వారు స్కూల్ కు వస్తున్నారనీ..తినటానికి కూడా కడుపునిండా తిండి లేదని తెలుసుకున్నారు. అంతే ఆమెలో అమ్మమనస్సు తల్లడిల్లిపోయింది.

ఆ 50మంది చిన్నారుల్ని దత్తత తీసుకుంటున్నాననీ..వారంతా 10 వ తరగతి పూర్తి అయ్యే వరకూ ఖర్చు మొత్తం తానే భరిస్తానని తెలిపారు. రెహానా చేస్తున్న మంచి పనికి భర్త అండగా నీలబడడమే కాదు.. పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రశంశల వర్ధం కురిపిస్తున్నారు. రెహానా కుటుంబంలో ఆరుగురు ఉంటారు. ఓ పక్క డ్యూటీ మరోపక్క కుటుంబం బాధ్యత..ఇంకో పక్క చిన్నారుల ఆలనా పాలనా అంతా చూసుకుంటున్నారు. రెహానా మంచి మనసుతో చేస్తున్న ఈ పని పట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందినందనలు కురిపిస్తున్నారు.