Mumbai’s New Restrictions : ముంబైలో కఠిన ఆంక్షలు..సాయంత్రం 5 తర్వాత అవన్నీ బంద్

ముంబైలో కొద్ది రోజులుగా కరోనా కేసులతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు కూడా భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. వారాంతపు కర్ఫ్యూ అమలవుతున్నా వ్యాప్తికి అడ్డుకట్టపడటం

Mumbai’s New Restrictions : ముంబైలో కఠిన ఆంక్షలు..సాయంత్రం 5 తర్వాత అవన్నీ బంద్

Mumbai

Mumbai’s New Restrictions : ముంబైలో కొద్ది రోజులుగా కరోనా కేసులతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసులు కూడా భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. వారాంతపు కర్ఫ్యూ అమలవుతున్నా వ్యాప్తికి అడ్డుకట్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ముంబైలో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటలకు బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్​లు, పార్కులు,విహార స్థలాలు,ఇతర బహిరంగ స్థలాలకు ప్రజలు రాకుండా నిషేధించారు.

జనవరి 15 వరకు ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి. సాధారణ కేసులతో పాటు కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందడంతో నగరానికి కోవిడ్-19 మహమ్మారి ముప్పు కొనసాగుతోంది అని ఉత్తర్వుల్లో పేర్కొంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించి, ప్రజల ప్రాణాలకు ముప్పును నివారించి, ఆరోగ్యం, భద్రత కోసమే ఈ నిషేధిత ఉత్తర్వులు జారీచేశామని తెలిపింది. న్యూఇయర్ వేడుకలపై కూడా అధికారులు నిషేధాజ్ఞ‌లు జారీచేశారు.

అదేవిధంగా వివాహ కార్యక్రమాల్లో 50 మందికి మించరాదని మహా ప్రభుత్వం సృష్టం చేసింది. సామాజిక, మతపరమైన, రాజకీయ సభల్లో కూడా 50 మంది కంటే ఎక్కువ హాజరుకాకూడదని తెలిపింది. అంతిమ సంస్కారాల్లో 20 మందికన్నా ఎక్కువ పాల్గొనకూడదని తెలిపింది. ఇంతకుముందు ఇండోర్​లో 100 మంది.. బహిరంగ ప్రదేశాల్లో 250 మంది హాజరు కావొచ్చనే నిబంధనలు ఉండేవి. అయితే ఈ నియమాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఉద్దవ్ సర్కార్ సృష్టం చేసింది

ALSO READ Happy New Year 2022 : మొదలైన కొత్త ఏడాది..బాణాసంచా వెలుగులతో సంబరాలు