Medchal : ఆస్తి పన్ను కట్టలేదని ఇంటి తలుపులు, టీవీ, సోఫాసెట్‌ తీసుకెళ్లారు

మున్సిపల్‌ సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఓనర్‌ వేరే చోట ఉంటుండగా ప్రస్తుతం ఓ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. విషయాన్ని ఓనర్‌ దృష్టికి తీసుకెళతామని చె

Medchal : ఆస్తి పన్ను కట్టలేదని ఇంటి తలుపులు, టీవీ, సోఫాసెట్‌ తీసుకెళ్లారు

Muncipal

Municipal officials : మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగుడాలో మున్సిపల్‌ అధికారులు తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనందుకు ఏకంగా ఇంటి వస్తువులను తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులే దౌర్జన్యాలకు పాల్పడితే తమ పరిస్థితి ఏంటని కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్ది సమయమే ఉండటంతో అధికారులు పన్నుల వసూలు వేటలో పడ్డారు. ఫిర్జాదిగుడాలో మురళి రెసిడెన్షియల్‌లో ఓ ఇంటి ఓనర్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ కట్టలేదు. సుమారు 28 వేల రూపాయల బిల్లు పెండింగ్‌లో ఉంది. సిబ్బందితో కలసి వచ్చిన మున్సిపల్‌ సిబ్బంది.. ట్యాక్స్‌ కట్టలేదన్న కారణంతో ఇంటి తలుపులు పీక్కెళ్లారు. పైగా ఇంట్లోని టీవీ, సోఫాసెట్‌తో పాటు వస్తువులను కూడా తీసుకెళ్లారు.

MLA Garbage : కమిషనర్‌ ఇంటి ముందు చెత్త వేసిన ఎమ్మెల్యే..ఎందుకో తెలుసా?

మున్సిపల్‌ సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఓనర్‌ వేరే చోట ఉంటుండగా ప్రస్తుతం ఓ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. విషయాన్ని ఓనర్‌ దృష్టికి తీసుకెళతామని చెప్పినా సిబ్బంది వినలేదని వారు చెబుతున్నారు.

మరోవైపు ఇంటి యజమాని ఆరేళ్ల నుంచి పన్ను కట్టలేదంటున్నారు అధికారులు. 28వేల రూపాయల బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు చెబున్నారు. దీనిపై ఇదివరకే నోటీసులు ఇచ్చినా స్పందించలేదని తెలిపారు.