Munugode by poll : ఇక్కడ ఓటు వేసేది మీ చుట్టాలు కాదు..మునుగోడు ప్రజలు : ఈటల

మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారాల్లో మాటలతో హీట్ పుట్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగా బీజేపీ నేత ఈటల రాజేందర్ నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో మాట్లాడుతూ..వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సంస్కృతి తెలంగాణ చరిత్రలోనే లేదని అటువంటి విష సంస్కృతిని కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Munugode by poll :  ఇక్కడ ఓటు వేసేది మీ చుట్టాలు కాదు..మునుగోడు ప్రజలు : ఈటల

Munugode by poll : మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారాల్లో మాటలతో హీట్ పుట్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగా బీజేపీ నేత ఈటల రాజేందర్ నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో మాట్లాడుతూ..వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సంస్కృతి తెలంగాణ చరిత్రలోనే లేదని అటువంటి విష సంస్కృతిని కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఓటర్లను డబ్బుతో కొనే కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోవటానికి టీఆర్ఎస్ నేతలు యత్నాలు చేస్తున్నారని ఇదంతా బీజేపీ గెలుస్తుందనే భయంతోనే చేస్తున్నారంటూ ఎధ్దేవా చేశారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించటానికి కేసీఆర్ లెంకలపల్లి వస్తారట..ఇక్కడ ఓట్లు వేసేది మీ చుట్టాలు కాదు మునుగోడు ప్రజలు అంటూ ఎద్దేవా చేశారు ఈటల.

ప్రజల మద్దతు కూడగట్టడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు ప్రధాని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు. దీపావళి పండుగనాడు కూడా ఎన్నికల ప్రచారం చేశారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఈటల రాజేందర్ తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ..మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు తండోపతండాలుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని..ఇదంతా బీజేపీ గెలుస్తుందనే భయంతోనేనని అన్నారు. ఓటు కోసం వస్తున్న టిఆర్ఎస్ మంత్రులను నిలదీయాలని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని ఈటల రాజేందర్ అన్నారు ఈటల.