Munugode Bypoll: ఫలితాల వెల్లడిలో జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది.

Munugode Bypoll: ఫలితాల వెల్లడిలో జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్

Munugode Bypoll: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే, ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని బీజేపీ అభ్యంతరాలు తెలుపుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే.

ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కాగా, ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండుకు ఫలితాలు మారుతుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరి రౌండ్ ఫలితం ఇవాళ ఒంటి గంటలోగా విడుదల అయ్యే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..