Munugode Bypoll: ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగలేదు: ఫలితాల వెల్లడిలో జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వేళ ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని టీఆర్ఎస్, బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనిపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పందించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగలేదని స్పష్టం చేశారు. 4వ , 5వ రౌండ్ లో 20 నిమిషాల చొప్పున ఆలస్యమైందని అన్నారు. తెలంగాణ ఇతర రాష్ట్రాల మాదిరిగా అంత త్వరగా ఫలితాలు రావని, ఇక్కడ ఫలితాలు కొద్దిగా ఆలస్యం అవుతాయని చెప్పారు.

Munugode Bypoll: ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగలేదు: ఫలితాల వెల్లడిలో జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ceo vikas raj (1)

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వేళ ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని టీఆర్ఎస్, బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనిపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పందించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగలేదని స్పష్టం చేశారు. 4వ , 5వ రౌండ్ లో 20 నిమిషాల చొప్పున ఆలస్యమైందని అన్నారు. తెలంగాణ ఇతర రాష్ట్రాల మాదిరిగా అంత త్వరగా ఫలితాలు రావని, ఇక్కడ ఫలితాలు కొద్దిగా ఆలస్యం అవుతాయని చెప్పారు.

ఇప్పటికే తాము కౌంటింగ్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని అన్నారు. అధికారులు, ఏజెంట్లు, మీడియా సమక్షంలోనే కౌంటింగ్ జరుగుతోందని చెప్పారు. ఎన్నిక ఫలితాల్లో జాప్యంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి, ఇతర నేతలు మాట్లాడారని, వారికి అన్ని విషయాలు స్పష్టంగా చెప్పామని అన్నారు.

ప్రతి రౌండ్ కు అరగంట పడుతుందని చెప్పారు. ఫలితాలు వెలువడటానికి మొత్తం సమయం 7.30 గంటలు పడుతుందని అన్నారు. 4వ రౌండ్ విషయంలో మరో సారి లెక్కింపుపై అక్కడి అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాగా, ఫలితాల అప్ లోడ్ విషయంలో సిబ్బందిపై వికాస్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..