Salar Jung Museum: మ్యూజియం డే వేడుకలకు సాలార్‌జంగ్ ముస్తాబు

ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకుని హైదరాబాద్, సాలార్‌జంగ్ మ్యూజియంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

Salar Jung Museum: మ్యూజియం డే వేడుకలకు సాలార్‌జంగ్ ముస్తాబు

Salar Jung Museum

Salar Jung Museum: ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకుని హైదరాబాద్, సాలార్‌జంగ్ మ్యూజియంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి 21 వరకు, వారం రోజులపాటు వేడుకలు జరుగుతాయన్నారు. మ్యూజియం డేకు సంబంధించిన వివరాలను నాగేందర్ రెడ్డి వెల్లడించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వారం రోజుల్లో సందర్శకులు ఎవరైనా కెమెరాలతో ఉచితంగా సాలార్‌జంగ్ మ్యూజియం చూడొచ్చు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు మ్యూజియం అందుబాటులో ఉంటుంది. ప్రైవేటు సంస్థలు కూడా పర్యాటకుల్ని ఉచితంగా తీసుకురావొచ్చు. రాత్రి వేళలో కూడా మ్యూజియం అందంగా కనిపించేలా అలంకరించనున్నారు. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, 75 రకాల వస్తువులతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.

Hyderabad : సినీ నటిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్

పాఠశాల పిల్లలకు కళలు, చేతిపనులు, డ్రాయింగ్ మొదలైన వాటిపై శిక్షణ ఇస్తారు. బిద్రి తయారీపై ఒక రోజు వర్క్‌షాప్/ప్రదర్శన, ఉపన్యాసం ఉంటుంది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి చెందిన 75 మంది కళాకారులచే ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భాగ్యనగర్ ఫోటో ఆర్ట్ క్లబ్‌తో కలిసి మ్యూజియం వస్తువులపై ఫోటోగ్రఫీలో పోటి ఉంటుంది. దీనిలో గెలిచిన వాళ్లకు నగదు బహుమతి కూడా అందిస్తారు. యూరోపియన్ ఆర్ట్‌లో హాస్యం”పై ప్రత్యేక ఉపన్యాసంతోపాటు, ‘‘ప్రివెంటివ్ కన్జర్వేషన్’’పై వెబ్‌నార్ కూడా ఉంటుంది. ఐ లవ్ ‘ఎస్‌జేఎమ్’ పేరుతో రెండు ప్రదేశాల్లో ఫోటో పాయింట్/సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, అనాథ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జానపద కళాకారులచే కార్యక్రమాలు ఉన్నాయి.