Muslim Weddings : వివాహ వేడుకల్లో డ్యాన్స్, డీజే, బాణాసంచా నిషేధం.. ఆదేశాలు జారీ చేసిన మతపెద్దలు
ఝార్ఖండ్ లో వివాహ వేడుకలకు సంబంధించి ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, డీజే, బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు దాన్‌బాద్ జిల్లా ముస్లిం మత పెద్దలు ఆదేశాలు జారీ చేశారు.

Muslim clerics
Muslim Weddings : ఝార్ఖండ్ లో వివాహ వేడుకలకు సంబంధించి ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, డీజే, బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు దాన్‌బాద్ జిల్లా ముస్లిం మత పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నిర్సా బ్లాక్‌లోని సిబిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ పేర్కొన్నారు.
వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం, బాణాసంచా కాల్చడం ఇస్లామిక్ వ్యతిరేక పద్ధతులని చెప్పారు. వివాహ వేడుకల్లో ఇకపై వీటిని నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వెల్లడించారు. ఈ ఆదేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.5,100 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Religious Harmony : వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహంపై పూలవర్షం కురిపించిన ముస్లింలు
అలాగే రాత్రి వేళ వివాహాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 11 గంటలలోపు వివాహం జరిపించాలని సూచించారు. 11 గంటల తర్వాత ఎవరైనా నికాహ్ చేయడానికి ప్రయత్నిస్తే వారికి కూడా జరిమానా విధిస్తామని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు రాతపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి ఉంటుందని మౌలానా మసూద్ అక్తర్ పేర్కొన్నారు.