Teacher Saree : చీర కట్టుకుని రావాల్సిందే.. స్కూల్ టీచర్లకు కొత్త ఆంక్షలు

చీర కట్టుకుని రావాల్సిందే.. ఇదీ.. స్కూల్ టీచర్లకు విధించిన కొత్త ఆంక్షలు. ఈ ఆంక్షలు విధించింది ఎక్కడో తెలుసా?

Teacher Saree : చీర కట్టుకుని రావాల్సిందే.. స్కూల్ టీచర్లకు కొత్త ఆంక్షలు

Teacher Saree

Teahcer Saree : చీర కట్టుకుని రావాల్సిందే.. ఇదీ.. స్కూల్ టీచర్లకు విధించిన కొత్త ఆంక్షలు. ఈ ఆంక్షలు విధించింది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు కేరళలో. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లపై స్కూళ్ల యాజమాన్యాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తప్పనిసరిగా చీర కట్టుకునే రావాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కాగా, ఈ నిర్ణయం వివాదానికి దారితీసింది. దీనిపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దుస్తులపై ఆంక్షలేంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆర్. బిందు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

Raja Ravindra : “ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో తొలిసారి కోటి రూపాయలు గెలుచుకున్న ఎస్ఐ

దీనిపై మంత్రి స్పందించారు. ఏ వస్త్రాలు ధరించాలన్నది టీచర్ల వ్యక్తిగత అభిప్రాయమని, చీరలే కట్టుకుని రావాలనడానికి స్కూళ్ల యాజమాన్యాలకు హక్కు ఏముందని ప్రశ్నించారు. ‘అసలు మీరెవరు ఆదేశించడానికి?’ అంటూ ఆమె మండిపడ్డారు. తాను కేవలం మంత్రిని మాత్రమే కాదని, ఓ కాలేజీలో ప్రొఫెసర్ నని అన్నారు. వస్త్రధారణ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని చెప్పిందన్నారు. తమకు నచ్చిన దుస్తుల్లో టీచర్లు స్కూలుకు వెళ్లొచ్చన్నారు. ఇలాంటి పాతబడిన కట్టుబాట్లను బలవంతంగా రుద్దడం ప్రగతిశీల కేరళకు మంచిది కాదన్నారు.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

ఇటు రాష్ట్ర విద్యాశాఖ కూడా వస్త్రధారణపై సర్క్యులర్ ను జారీ చేసింది. టీచర్లు తమకు నచ్చిన దుస్తులు ధరించి స్కూలుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. ఎలాంటి ఆంక్షలూ అమల్లో లేవంది. చాలా స్కూళ్లు, యాజమాన్యాలు ఆంక్షలు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, మళ్లీ ఇది జరగకుండా చూడాలని ఆదేశించింది.