‘బస్తీ బాలరాజు’ చావు గురించి ఏం చెప్పాడో తెలుసా!

‘బస్తీ బాలరాజు’ చావు గురించి ఏం చెప్పాడో తెలుసా!

Chaavu Kaburu Challaga: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కార్తికేయ, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీతా గోవిందం’, ‘ప్రతిరోజూ పండగే’, వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. కార్తికేయ ఫస్ట్ టైమ్ ‘బస్తీ బాలరాజు’ అనే మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. లావణ్య నర్స్‌గా నటిస్తోంది. శనివారం ‘‘చావు కబురు చల్లగా’’ అనే టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Chaavu Kaburu Challaga

జాక్స్ బెజోయ్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. లిరిక్ రైటర్ కరుణాకర్ అడిగర్ల కథలోని సందర్భానికి తగ్గట్లు, హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అయ్యేలా అద్భుతమైన పదాలు అంతకన్నా అద్భుతంగా రాశారు.. ఇది ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్.. మాంచి ఊపున్న మాస్ సాంగ్.. థియేటర్లలో మాస్ ఆడియెన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తుంది.. అనడంలో ఎలాంటి సందేహం లేదు..

సింగర్ రేవంత్ మంచి ఎనర్జీతో పాడారు. లిరికల్ వీడియోలో కార్తికేయ డ్యాన్స్ కుమ్మేశాడు.. అతను చేసిన మాస్ మూమెంట్స్ మెగాస్టార్ ని గుర్తు చేశాయి.. ఆమని, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.