ఆడవారిని అవమానించేలా ఉందంట.. మారిన మింత్రా లోగో!

ఆడవారిని అవమానించేలా ఉందంట.. మారిన మింత్రా లోగో!

e-commerce giant Myntra: ఆడువారి మనోభావాలు దెబ్బతీసేలా లోగో ఉందంటూ ఈ-కామర్స్ సంస్థ మింత్రాపై ఓ సామాజిక కార్యకర్త కోర్టు మెట్లెక్కగా.. లోగోను మార్చాలని నిర్ణయం తీసుకుంది సదరు ప్రభుత్వం. ఆ సంస్థ లోగో మహిళలను కించపరిచేలా ఉందంటూ ముంబైలో కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అవెస్తా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నాజ్ పటేల్ 2020 డిసెంబరులో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు మింత్రా లోగోపై ఫిర్యాదు చేశారు.

మింత్రా లోగో అభ్యంతరకరమైన భంగిమలో ఉందని, మహిళలను అవమానపరిచేలా ఉందంటూ ఆమె ఆరోపించారు. వెంటనే దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పిటీషన్‌లో చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మింత్రా లోగో మహిళలను కించపరిచేలా ఉందని నిర్ధారించుకుని సదరు సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీచేయగా.. సంస్థ పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే నెలలోపే లోగోను మార్చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం లేటెస్ట్‌గా సంస్థ లోగోను మార్చింది.

ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరండికార్ ఈ విషయాన్ని వెల్లడించారు. వెబ్‌సైట్‌లోనూ.. యాప్‌లో కూడా లోగోను మార్చివేస్తున్నట్టు మింత్రా ప్రకటించింది. ప్యాకేజింగ్ మెటీరియల్‌పైనా లోగోను మారుస్తున్నట్టు స్పష్టం చేసింది.