‘ఆహా’ లో నరేష్ ‘నాంది’

‘ఆహా’ లో నరేష్ ‘నాంది’

Naandhi OTT Rights: ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరించిన ‘అల్లరి’ నరేష్.. తనలోని నటుణ్ణి బయటకు తీసే విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడిగా నిరూపించుకోవాలని ‘నాంది’ అనే ఓ ఢిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

Naresh

యూనిట్ పడ్డ కష్టానికి ప్రతిఫలంగా సినిమా మంచి విజయం సాధించింది.. చాలా సంవత్సరాల తర్వాత హిట్ రావడంతో సక్సెస్‌మీట్‌లో ఎమోషనల్ అయ్యారు నరేష్.. ప్రస్తుతం టీమ్ అంతా సక్సెస్ టూర్‌లో ఉన్నారు. ఇంతలో తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ వారికి ‘ఆహా’ అనిపించే సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Naandhi

‘నాంది’ డిజిటల్ రైట్స్‌ను రూ. 2.65 కోట్లకు ‘ఆహా’ సొంతం చేసుకుంది.. రీసెంట్‌గా దీనికి సంబంధించిన అధికారిక లావాదేవీలు పూర్తయ్యాయి. త్వరలో ‘ఆహా’ లో నరేష్ ‘నాంది’ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ శుభవార్తతో ‘నాంది’ టీమ్ ఆనందం రెట్టింపు అయ్యింది..