Nag Akkineni: బంగార్రాజు అవతారంలోకి నాగ్.. జులై నుండి షూటింగ్ స్టార్ట్!

సీనియర్ హీరోలలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్న స్టార్ నాగార్జున. కథల ఎంపికకు తోడు ఏజ్ మేనేజ్ చేసేలా నాగ్ లుక్కు తనకు అడ్వాంటేజ్ కాగా ఇప్పటికీ స్టార్ హీరోలతో సమానంగా లేడీ ఫాలోయింగ్ లో ఏ మాత్రం తీసిపోవడం లేదు.

Nag Akkineni: బంగార్రాజు అవతారంలోకి నాగ్.. జులై నుండి షూటింగ్ స్టార్ట్!

Nag Akkineni

Nag Akkineni: సీనియర్ హీరోలలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్న స్టార్ నాగార్జున. కథల ఎంపికకు తోడు ఏజ్ మేనేజ్ చేసేలా నాగ్ లుక్కు తనకు అడ్వాంటేజ్ కాగా ఇప్పటికీ స్టార్ హీరోలతో సమానంగా లేడీ ఫాలోయింగ్ లో ఏ మాత్రం తీసిపోవడం లేదు. రీసెంట్ గా వైల్డ్ డాగ్ తో సక్సెస్ కొట్టిన నాగ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ ఓటీటీలో విడుదలవగా సరికొత్త రికార్డులు కొట్టేలా దూసుకెళ్తుంది.

కాగా.. నాగ్ ఏడేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయన సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. నాగ్ డబుల్ రోల్ లో రొమాంటిక్ యాంగిల్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమా విడుదలైన సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రకటించాడు. రెండేళ్ల నుండి ఈ సీక్వెల్ కోసం ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. బంగార్రాజు పేరుతో సినిమాను కూడా ప్రకటించారు. అయితే.. ఆ సినిమా అప్పటి నుండి ఎందుకో పట్టాలెక్కలేదు.

ఈ బంగార్రాజు సినిమా అనుకున్నాక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అక్కినేని బ్యానర్ మీదనే నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేయగా నాగార్జున దేవదాస్, మన్మధుడు-2, వైల్డ్ డాగ్ సినిమాలు చేశాడు. కాగా, ఇప్పుడు బంగార్రాజు సినిమా చేసేందుకు నాగ్ సిద్దమవగా జులై నుండి షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగ్ కు జోడీగా రమ్యకృష్ణనే నటిస్తుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నాగ్ చెప్పిన ఈ మాటతో మరోసారి అక్కినేని అభిమానులలో ఆసక్తి మొదలైంది.