Naga Chaitanya: విజయ్ స్థానంలో చైతూ.. మజిలీ కాంబినేషన్ రిపీట్ చేస్తారా?

అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి అన్నట్లు మారింది దర్శకుడు శివనిర్వాణ పరిస్థితి. ఈ దర్శకుడికి చేద్దామనుకున్నది ఒక్కటి.. అఖరికి అవుతున్నదొక్కటి అయింది. ప్యాన్ ఇండియా స్టార్ విజయ్..

Naga Chaitanya: అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి అన్నట్లు మారింది దర్శకుడు శివనిర్వాణ పరిస్థితి. ఈ దర్శకుడికి చేద్దామనుకున్నది ఒక్కటి.. అఖరికి అవుతున్నదొక్కటి అయింది. ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేసుకున్న శివనిర్వాణకి ఇప్పుడు కథ అడ్డంతిరిగింది. సారీ బాస్ అని సింపుల్ గా విజయ్ తప్పుకోవడంతో అక్కినేని హీరో నాగ చైతన్య శివకి రెండోసారి ఛాన్స్ ఇచ్చాడు.

Big Boss 5: ఏడ్చేసిన లోబో.. లహరి, శ్రీరామ్‌కు పెళ్లి చేసిన హౌస్ మేట్స్!

లవ్ స్టోరీల్లో తనకంటూ ఓ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న శివనిర్వాణ.. సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. నానితో నిన్నుకోరి.. నాగచైతన్యతో మజిలీ సినిమాలు చేసిన శివనిర్వాణ.. మొన్నీమధ్యే టక్ జగదీష్ సినిమా రిలీజ్ చేశారు. మిక్స్ డ్ టాక్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా గొలా గట్టెక్కేసింది. టక్ జగదీష్ రిలీజ్ కాకముందు నుంచే విజయ్ తో శివనిర్వాణ సినిమా చేస్తున్నానంటూ పబ్లిక్ గానే అనౌన్స్ చేశాడు శివనిర్వాణ.

Naga Chaitanya: విజయ్ స్థానంలో చైతూ.. మజిలీ కాంబినేషన్ రిపీట్ చేస్తారా?

కానీ ఇప్పుడు విజయ్ ప్లేస్ లో మరో హీరో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. రెండేళ్ల క్రితమే విజయ్ తో సినిమా అనౌన్స్ చేసిన శివనిర్వాణ.. ఆ స్టోరీకి సంబందించి స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేశాడు. కానీ ఇప్పుడు ఆ సినిమా సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ కనిపించడంలేదు. ఎందుకంటే.. లైగర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న శివనిర్వాణ.. శివతో సినిమా చెయ్యడానికి చాలా టైమ్ పట్టేలా కనిపిస్తోందని కొందరంటుంటే . విజయ్ ఇప్పుడు శివనిర్వాణతో సినిమా చెయ్యడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని మరో టాక్ నడుస్తోంది.

Love Story: సెన్సిబుల్ లవ్‌స్టోరీ కోసం సిలబస్ మార్చేసిన శేఖర్ కమ్ముల

విజయ్ తో నెక్ట్స్ సినిమా ప్లాన్ చేసుకున్న శివనిర్వాణ.. ఆ సినిమా వర్కవుట్ అవ్వకపోవడంతో ఆల్రెడీ తనతో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్యకి స్టోరీ చెప్పి.. వెంటనే సినిమాని ఓకే చేయించుకున్నారు. ప్రజెంట్ విక్రమ్ తో చేస్తున్న థాంక్యూ మూవీ అయిపోవడంతో నెక్ట్స్ శివనిర్వాణ సినిమాకే షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నాడు నాగచైతన్య. శివనిర్వాణ, నాగచైతన్య-సమంత కాంబినేషన్లో వచ్చిన మజిలీ సినిమా నాగచైతన్య కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సో..రెండో సారి చేస్తున్న ఈ కాంబినేషన్ కూడా హిట్ గ్యారంటీ అన్న టాక్ స్టార్టయ్యింది.

ట్రెండింగ్ వార్తలు