Updated On - 9:27 pm, Sat, 6 March 21
Naga Chaitanya Fans: సినిమా ఫంక్షన్‌లో ఏదో కాసేపు అభిమానులకు హాయ్ చెప్పి వెళ్లిపోవడం, పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక సహనం కోల్పోవడం వంటి సంఘటనలు చాలానే చూశాం.. కానీ చైతన్య బాబుని చూస్తే మాత్రం చూడముచ్చటగా అనిపిస్తోంది.. వాళ్ల తాత గారు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని చూస్తున్నట్టే ఉంది.. తాత, తండ్రి దగ్గరినుండి వారసత్వంతో పాటు క్రమశిక్షణ, సహనం కూడా అలవర్చుకున్నాడు నాగ చైతన్య బాబు అంటున్నారు అప్పటి అక్కినేని నుండి ఇప్పటి అఖిల్ వరకు ఆ కుటుంబానికి గల వీరాభిమానులు..
వివరాల్లోకి వెళ్తే.. ‘లవ్ స్టోరీ’ తర్వాత చైతన్య, అక్కినేని ఫ్యామిలీకి ఆల్ టైం మెమరబుల్ మూవీ ‘మనం’ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ తో ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. చైతన్య బాబుని చూడడానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున లొకేషన్‌కి వస్తున్నారు.
చైతుని చూడడం కోసం ఓ అభిమాని ఏకంగా నదిలోకి దూకిన సంఘటన కూడా చూశాం. ఇదిలా ఉంటే చైతన్య తనను కలవడానికి వచ్చిన అభిమానుల కోసం వీలైనంత టైం కేటాయిస్తూ.. స్టే చేస్తున్న హోటల్ దగ్గర, షూటింగ్ స్పాట్‌లోనూ వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, వారికి ఫొటోలు ఇస్తున్నాడు.
తమ అభిమాన హీరోతో తీసుకున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ సంబరపడిపోతున్నారు అక్కినేని అభిమానులు. కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’, చైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమాలతో రెండు వారాల వ్యవధిలో ఫ్యాన్స్‌కి రెండు హిట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు.
RC 15 : సీఎంగా చరణ్!.. శంకర్ ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారా?..
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
Megastar Chiranjeevi : మెస్మరైజింగ్ మెగా అప్డేట్.. చరణ్, శంకర్ సినిమాలో చిరు..
Vakeel Saab Movie : గద్వాలలో పవన్ ఫ్యాన్స్ వీరంగం, థియేటర్ తలుపులు ధ్వంసం
tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్
Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..