Naga Chaitanya: ముగింపు దశలో చైతూ ‘థాంక్యూ’.. త్వరలోనే ఫస్ట్ లుక్!

అక్కినేని యువసామ్రాట్ కూడా ఇప్పుడు వరస సినిమాలను ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. చైతూ ఇప్పటికే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ పూర్తిచేయగా విడుదలకు ప్లాన్ చేసేలోపే కరోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చి వాయిదా పడేలా చేసింది. సాయిపల్లవి జంటగా నటించిన ఆ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసుకుంది.

Naga Chaitanya: ముగింపు దశలో చైతూ ‘థాంక్యూ’.. త్వరలోనే ఫస్ట్ లుక్!

Naga Chaitanya Thank You Movie

Naga Chaitanya: అక్కినేని యువసామ్రాట్ కూడా ఇప్పుడు వరస సినిమాలను ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. చైతూ ఇప్పటికే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ పూర్తిచేయగా విడుదలకు ప్లాన్ చేసేలోపే కరోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చి వాయిదా పడేలా చేసింది. సాయిపల్లవి జంటగా నటించిన ఆ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసుకుంది. ముఖ్యంగా సారంగ దరియా పాట తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ చేసి పెట్టింది. కాస్త కరోనా తగ్గి థియేటర్స్ ఓపెన్ చేస్తే వచ్చే మొదటి సినిమాలలో చైతూ లవ్ స్టోరీ ఉండడం గ్యారంటీ.

ఇక, అదలా ఉండగానే చైతూ మరో సినిమాను కూడా పూర్తిచేశాడు. అక్కినేని కుటుంబానికి మనం లాంటి మెమరబుల్ సినిమాను అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతూ థాంక్యూ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించిన రోజునే ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం దాదాపుగా ముగింపు దశకు వచ్చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నారట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ నెల చివరిలో కానీ.. జులై మొదటి వారంలో కానీ థాంక్యూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయాలనీ.. అప్పటి నుండే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో చైతూకి జోడిగా రాశిఖన్నా నటిస్తుండగా అవికా ఘోర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.