Naga Chaitanya: కలిసిరాని పాత్రలో చైతూ.. ఈసారైనా గట్టెక్కేనా?

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ నేడు ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల మధ్య వచ్చిన సంగతి తెలిసిందే. తన నెక్ట్స్ మూవీని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో చేయబోతున్న చైతూ, ఈ సినిమాలో తనకు కలిసిరాని సెంటిమెంట్‌ను మరోసారి ఫోలో అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Naga Chaitanya: కలిసిరాని పాత్రలో చైతూ.. ఈసారైనా గట్టెక్కేనా?

Naga Chaitanya To Play A Cop In His Next Movie

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ నేడు ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల మధ్య వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతూ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా తరువాత చైతూ చేస్తున్న సినిమాల లైనప్ చూసి ప్రేక్షకులు ఆయన నెక్ట్స్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Naga Chaitanya : ‘మానాడు’ నేను చేయాలి.. కానీ రానా చేస్తున్నాడు.. నా నెక్స్ట్ సినిమాలు ఇవే..

అయితే ఈ లైనప్‌లో చైతూ తన నెక్ట్స్ మూవీని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో చేయబోతున్న సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో చైతూ పాత్రపై అభిమానుల్లో టెన్షన్ మొదలైనట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో చైతూ పోలీస్ పాత్రలో నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించాడు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందేమో అని చైతూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Naga Chaitanya : ఫస్ట్ లవ్ గురించి చెప్పేసిన నాగచైతన్య.. సమంత కాదట..

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా చైతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడట. మరి ఈసారైనా పోలీస్ పవర్‌తో చైతూ సక్సెస్ అందుకుంటాడా లేక తుస్సుమంటాడా అనేది ఈ సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తోంది. ఇక ఈ హీరో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’లో బాలరాజు అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటంతో బాలీవుడ్‌లో ఈ అక్కినేని హీరోకు మంచి గుర్తింపు లభిస్తుందని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి.