Naga Chaitanya : నేను మళ్ళీ ప్రేమలో పడతాను.. బతకడానికి ఊపిరి ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే..

మీరు మళ్లీ ప్రేమలో పడే అవకాశం ఉందా? అని అడగగా నాగ చైతన్య సమాధానమిస్తూ.. ''తప్పకుండా పడతాను. ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం

Naga Chaitanya :  నేను మళ్ళీ ప్రేమలో పడతాను.. బతకడానికి ఊపిరి ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే..

Naga Chaitanya :   నాగ చైతన్య త్వరలో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చడ్డా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో చైతూ మొదటిసారి బాలీవుడ్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం చైతూ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చైతూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి మాట్లాడాడు.

సమంతతో విడిపోయాక చైతూ సింగిల్ గానే నివసిస్తున్నాడు. ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చినా వాటికి చైతూ స్పందించలేదు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మీరు మళ్లీ ప్రేమలో పడే అవకాశం ఉందా? అని అడగగా నాగ చైతన్య సమాధానమిస్తూ.. ”తప్పకుండా పడతాను. ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం జరుగుతుందో. మనిషి జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. మనం ప్రేమించాలి. ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవాలి. అలా జరిగితేనే మనం ఆరోగ్యంగా, పాజిటివ్‌గా ఉంటాం” అని తెలిపాడు.

Naga Chaitanya : సమంతని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను.. సమంత వర్క్ ప్రతీది చూస్తాను..

ఇటీవల సమంత కాఫీ విత్ కరణ్ షోలో మళ్ళీ ప్రేమలో పడే అవకాశమే లేదు అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చైతూ మళ్ళీ ప్రేమలో పడే అవకాశం ఉంది అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.