నాగాలాండ్ లో కుక్కల మాంసం నిషేధం

  • Published By: madhu ,Published On : July 4, 2020 / 07:21 AM IST
నాగాలాండ్ లో కుక్కల మాంసం నిషేధం

కుక్కల మాంసాన్ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఉద్యమానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. డాగ్ మీట్ పై నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది. దిమాపూర్ మార్కెట్ లో సంచుల్లో కుక్కలను కట్టివేయడం, కుక్కలను విక్రయించడం తదితర ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

కుక్కల దిగుమతి, కుక్కల మార్కెట్లు, వీటి మాంసంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నది తెలివైన నిర్ణయమని నాగాలాండ్ ప్రధాన కార్యదర్శి టెంజెన్ టాయ్ వెల్లడించారు. ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఏపీవో) నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియూ రియోకు ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

దిమాపూర్ మార్కెట్ లో కుక్కల నోటిని తాడుతో కట్టేసి గోనె సంచులో ప్యాక్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కుక్కల మాంసాన్ని నిషేధించాలని Federation of Indian Animal Protection Organisations (FIAPO) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

రాష్ట్రంలో డాగ్ మీట్ అమ్మకం, అక్రమ రవాణా, వినియోగంపై నిషేధాన్ని, జంతు సంక్షేమ చట్టాలను అమలు చేయాలని నాగాలాండ్ ప్రభుత్వాన్ని తాము కోరడం జరిగిందని FIAPO ప్రతినిధి వెల్లడించారు. నటి ప్రియాంక చోప్రా నటించిన మేరీ కోమ్ దర్శకుడు ఒముంగ్ కుమార్ ఆన్ లైన్ లో జరుగుతున్న ప్రచారంలో పాల్గొన్నారు. కుక్క మాంసాన్ని నిషేధించాలని కోరుతూ మెయిల్స్ పంపాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ వ్యాపారంపై 2016లో జంతువులను రక్షించే కార్యకర్తలు ప్రభుత్వానికి ఓ నివేదిక పంపారు. తాము 2016 నుంచి పరిశోధనలు చేస్తున్నామని, ఈశాన్య రాష్ట్రాల నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి కుక్కలను వధించడానికి తీసుకొస్తున్నారని తెలిపారు. నాగాలాండ్ లో కుక్కల మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక్కడ కిలో మాంసం రూ. 200 విక్రయిస్తుంటారు. కుక్క ధర రూ. 2 వేల వరకు పలుకుతుందని అంచనా

Read:కరోనా బాధితులను ‘హైడ్రాక్సి క్లోరోక్విన్’ కాపాడింది.. కొత్త అధ్యయనం ఇదే తేల్చింది!