Bimbisara: బింబిసార సక్సెస్.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ!

నందమూరి కళ్యాణ్ రామ్ చాలా రోజుల తరువాత ‘బింబిసార’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా రిలీజ్ రోజునే అద్భుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది.

Bimbisara: బింబిసార సక్సెస్.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ!

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ చాలా రోజుల తరువాత ‘బింబిసార’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా రిలీజ్ రోజునే అద్భుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు తొలిరోజే సగానికి పైగా వసూళ్లు రావడంతో టోటల్ రన్‌లో ఈ సినిమా ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని అభిమానులు అంటున్నారు.

Bimbisara 1st Day Collections: బింబిసార ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే సగం.. టెర్రిఫిక్ స్టార్ట్!

రిలీజ్ రోజున సినిమా ఎలా ఉందో చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు ఎక్కువగా వస్తుంటారు. అయితే రెండో రోజు కూడా బింబిసార థియేటర్ల వద్ద ఆడియెన్స్ కోలాహలం కనిపించింది. దీంతో ఈ సినిమా సాలిడ్ అక్యుపెన్సీతో రన్ అవుతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అటు వీకెండ్ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశంగా చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ మూవీ తొలి వీకెండ్ ముగిసేసరికే బ్రేక్ ఈవెన్‌కు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వారు అంటున్నారు.

NTR Tweet on Bimbisara : అన్నా నువ్వు తప్ప ఎవరూ చేయలేరు ఆ క్యారెక్టర్.. బింబిసారపై ఎన్టీఆర్ ట్వీట్..

ఈ లెక్కన బింబిసార చిత్రం రానున్న రోజుల్లో పూర్తిగా లాభాలను తెచ్చిపెట్టే సినిమాగా మారనుందా అంటే అవుననే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. టాక్ సూపర్‌గా ఉండటం, సినిమాలో కంటెంట్ సరికొత్తగా ఉండటంతో ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ కూడా వస్తారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా బింబిసార చిత్రంతో కళ్యాణ్ రామ్ సూపర్ సక్సెస్ అందుకోవడం నిజంగా తమకు సంతోషంగా ఉందని నందమూరి అభిమానులు అంటున్నారు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్‌తో తారక్, బింబిసారతో కళ్యాణ్ రామ్‌లు వరుసగా సక్సెస్‌లు అందుకోవడంతో వారంతా ఫుల్ ఖుషీలో ఉన్నామంటున్నారు.