Bimbisara Trailer Release: కల్యాణ్ రామ్ న్యూ లుక్‌.. సినిమా ప్రియులను కట్టిపడేస్తున్న‘బింబిసార’ టైలర్

నటుడు నందమూరి కల్యాణ్ రామ్ కేరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్ర ‘బింబిసార’.. ఈ సినిమాకు సంబంధించిన టైలర్ సోమవారం విడుదలైంది. ఈ టైలర్‌లో కల్యాణ్ రామ్ న్యూ లుక్, డైలాగ్స్ నందమూరి అభిమానులను, సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి.

Bimbisara Trailer Release: కల్యాణ్ రామ్ న్యూ లుక్‌.. సినిమా ప్రియులను కట్టిపడేస్తున్న‘బింబిసార’ టైలర్

Bimbasara

Bimbisara Trailer Release: నటుడు నందమూరి కల్యాణ్ రామ్ కేరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్ర ‘బింబిసార’.. ఈ సినిమాకు సంబంధించిన టైలర్ సోమవారం విడుదలైంది. ఈ టైలర్‌లో కల్యాణ్ రామ్ న్యూ లుక్, డైలాగ్స్ నందమూరి అభిమానులను, సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. 2నిమిషాల 30 సెకండ్ల పాటు సాగే ఈ వీడియో.. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ చేసిన యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

Kalyan Ram

‘బింబిసార’ టైలర్‌లో కల్యాణ్ రామ్ రెండు గెటప్స్‌లో కనిపించారు. తొలుత యుద్ధ విన్యాసాలు, డైలాగ్స్‌తో అదరహో అనిపించగా.. టైలర్ చివరి భాగంలో మాస్ హీరో లుక్‌లో కనిపించారు. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడి గెటప్‌లో కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్స్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. బింబిసారుడంటే మరణశాసనం’.. ‘ ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే’.. లాంటి పవర్​ఫుల్​ డైలాగ్స్​తో ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకుంది.

Bibisara

ఈ ‘బింబిసార’ సినిమాతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రంలో కేథరిన్, సంయుక్త మేనన్ కథానియికలు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తి పెంచగా, తాజాగా విడుదలైన టైలర్ మరిన్ని అంచనాలను పెంచేలా ఉంది.