Hit 2 Trailer: హిట్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేసిన నాని, అడివి శేష్‌!

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన కాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్-2’ను చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో హీరోగా అడివి శేష్ నటిస్తున్నాడు. తాజాగా హిట్-2 ట్రైలర్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ చేసింది.

Hit 2 Trailer: హిట్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేసిన నాని, అడివి శేష్‌!

Nani Adivi Sesh Announced Release Date Of Hit 2 Trailer

Hit 2 Trailer: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన కాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్-2’ను చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాను కూడా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో హీరోగా అడివి శేష్ నటిస్తున్నాడు.

Hit 2 : హిట్-2 టీజర్ యూట్యూబ్ ట్రేండింగ్ నుంచి తొలిగింపు.. ఏమైంది?

ఇటీవల ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ చాలా నెమ్మదిగా ఇస్తున్నారని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిట్-2 ట్రైలర్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో హీరో అడివి శేష్, నిర్మాత నాని కలిసి ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు నాని, అడివి శేష్‌లు పేర్కొన్నారు.

HIT 2: ‘ఉరికే ఉరికే’ అంటూ రొమాంటిక్ పాట పాడుతోన్న అడివి శేష్

ఈ అనౌన్స్‌మెంట్‌తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి హిట్-2 సినిమాతో నాని నిర్మాతగా అదిరిపోయే సక్సెస్ అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కాగా ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్‌గా అందాల భామ మీనాక్షి చౌదరి నటిస్తోంది. మరి నవంబర్ 23న రిలీజ్ కానున్న హిట్-2 ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.