Nani Vs Raviteja : ఈ వారం.. సెల్ఫ్ మేడ్ హీరోల మధ్యే పోటీ.. నాని వర్సెస్ రవితేజ

నాని ఇప్పటికే పలు సినిమాలు తీసి విజయం సాధించి ఇప్పుడు మరిన్ని సినిమాలు, సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రవితేజ కూడా నిర్మాతగా మారారు. తాజాగా ఈ వారం నాని, రవితేజ నిర్మాతలుగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి.............

Nani Vs Raviteja : ఈ వారం.. సెల్ఫ్ మేడ్ హీరోల మధ్యే పోటీ.. నాని వర్సెస్ రవితేజ

Nani Vs Raviteja :  ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళల్లో చిరంజీవి తర్వాత రవితేజ, నాని పేర్లే చెప్తారు. రవితేజ, నాని ఇద్దరూ అసిస్టెంట్ డైరెక్టర్ గా జీవితం మొదలుపెట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని స్టార్ హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం ఇద్దరూ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు.

సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు సినిమాల్లో డబ్బులు సంపాదించి వేరే బిజినెస్ లలో పెడతారు. కానీ చాలా తక్కువమంది సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పెడతారు. రవితేజ, నాని కూడా.. సినిమా మాకు చాలా ఇచ్చింది, అందుకే మేము సంపాదించింది సినిమాల్లోనే పెడుతున్నాము అని అంటూ నిర్మాతలుగా మారారు.

నాని ఇప్పటికే పలు సినిమాలు తీసి విజయం సాధించి ఇప్పుడు మరిన్ని సినిమాలు, సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రవితేజ కూడా నిర్మాతగా మారారు. తాజాగా ఈ వారం నాని, రవితేజ నిర్మాతలుగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి. నాని నిర్మాతగా అడివి శేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2న థియేటర్స్ లో విడుదల కానుంది. రవితేజ నిర్మాణంలో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన మట్టి కుస్తీ సినిమా కూడా డిసెంబర్ 2నే విడుదల కానుంది.

Unstoppable with NBK : ఆహా అన్‌స్టాపబుల్‌ విత్ NBK షో.. ఐదో ఎపిసోడ్ గెస్టులు వీళ్ళే..

ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఈ రెండే కొంచెం పెద్ద సినిమాలు కావడంతో వీటి మధ్యే పోటీ నెలకొంది. ఇండైరెక్ట్ గా నిర్మాతలుగా నాని, రవితేజ మధ్య ఈ వారం పోటీ రానుంది. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో, ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి. అభిమానులు, సినీ ప్రేక్షకులు సెల్ఫ్ మేడ్ హీరోస్ ఇద్దరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నారు.